‘కింగ్’ నాగార్జున టాలీవుడ్లో ఓ స్టార్ హీరో. ఇప్పటికీ హీరోగానే సినిమాలు చేస్తూ వస్తున్నారు. కానీ డిఫరెంట్ గా చేస్తున్నారు. అందువల్ల నాగార్జున అభిమానులకు కొంత దూరమయ్యారు. అందువల్ల అతని సినిమాలు నిరాశ పరుస్తూ వచ్చాయి. దీంతో నాగార్జున పంధా మార్చి ‘కుబేర’ చేశారు. ఇది బాగా ఆడింది. కానీ ఆయన ఫ్యాన్స్ సంతృప్తి చెందలేదు. మరోపక్క ‘కూలి’ తో నాగార్జున పెద్ద ప్రయోగం చేశారు. తొలిసారిగా అందులో కంప్లీట్ విలన్ గా చేశారు. రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన సినిమా ఇది. లోకేష్ కనగరాజ్ దర్శకుడు.
మన సీనియర్ హీరోలు ఇంకా హీరోలుగానే సినిమాలు చేస్తున్నారు. పక్క భాషలకు చెందిన మోహన్ లాల్, మమ్ముట్టి వంటి స్టార్స్ హీరోలుగా చేస్తున్నా.. మరోపక్క విలన్ గా, స్పెషల్ క్యారెక్టర్స్ చేయడానికి కూడా రెడీ అయ్యారు. టాలీవుడ్ నుండి నాగార్జున ఓ అడుగు ముందుకేశారు. ‘కూలి’ కోసం రజినీకాంత్ ను హీరోగా ఒప్పించడానికి దర్శకుడు ఎక్కువ కష్టపడలేదట. కానీ నాగార్జునని విలన్ గా ఒప్పించడానికి ఎక్కువ కష్టపడ్డాడట.
లోకేష్ కనగరాజ్ మాట్లాడుతూ.. ” ‘అసలు ఈ పాత్రకి రజినీకాంత్ గారిని ఎలా కన్విన్స్ చేశావ్?’ అని అడిగారు. కానీ వాస్తవానికి రజినీకాంత్ సార్..ను ఒప్పించడానికి నేను కష్టపడలేదు. నాగార్జున సార్..ను ఒప్పించడానికే ఎక్కువ కష్టపడ్డాను. ఎందుకంటే ఆయన 40 ఏళ్ళ సినీ కెరీర్ లో సైమన్ వంటి పాత్ర చేయలేదు. ఆయన అన్నీ పాజిటివ్ రోల్స్ చేశారు. సో ఆయన ఫైనల్ కాల్ తీసుకోవడానికి 4 నుండి 6 నెలలు టైం తీసుకున్నారు. దాదాపు 8 సార్లు నేను నెరేషన్ ఇచ్చాను. గుడ్ ను బ్రేక్ చేయడానికి చాలా ఎగ్జామ్పుల్స్ చెప్పాను.
‘బ్యాడ్ క్యారెక్టర్ లో టాలెంట్ ను ఎక్కువగా వాడుకునే ఛాన్స్ ఉంటుంది. అక్కడ బౌండరీస్ ఉండవు’ ఇలా చాలా చెప్పి కన్విన్స్ చేశాను. నాగార్జున గారు నన్ను రజినీకాంత్ గారి గురించి అడిగినప్పుడు కూడా ‘మిమ్మల్ని ఒప్పించడమే కష్టం అనిపించింది సార్’ అని అన్నాను. అందుకు ఆయన సరదాగా నవ్వుకున్నారు” అంటూ అసలు విషయం చెప్పుకొచ్చాడు.