భార్గవ్ వర్మ, అరవింద్ ప్రకాశ్, రాజేష్‌రెడ్డి, రవికుమార్, మాధురి కీలక పాత్రధారులుగా లివితా యూనివర్సెల్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘మామా ఏక్ పెగ్‌లా’. సంతోష్ మనోహర్ దర్శకత్వంలో ‘కమలతో నా ప్రయాణం’ లాంటి చిత్రాన్ని నిర్మించిన సునీల్ రెడ్డి ఇసనాక నిర్మిస్తున్న చిత్రమిది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉంది. ‘‘యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. ఇటీవల విడుదల చేసిన ‘మామా ఆల్కహాల్ అంథమ్’ సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది. మాస్ యాంగిల్‌లో సాగే ఈ పాటను కడలి రచించారు. రాహుల్ సిప్లిగంజ్ పాడారు. సామ్యూల్ జెబి సంగీతం అందించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని నిర్మాత తెలిపారు.