Bigg Boss 5 Telugu: ఈసారి సీక్రెట్ రూమ్ లేకుండానే లోబోని పంపించేశారా..?

బిగ్ బాస్ హౌస్ లో 8వ వారం లోబో ఎలిమినేట్ అయిపోయినట్లుగా సమాచారం తెలుస్తోంది. దీపావళి ప్రత్యేకమైన ఎపిసోడ్ గా ఆరంభం అయిన బిగ్ బాస్ షోలో 8వ వారం నాటకీయత చోటు చేసుకుంది. అనీమాస్టర్ ఇంకా సన్నీ ఇద్దరూ కూడా ఒకరిపై ఒకరు ఆర్గ్యూ చేసుకున్నారు. దీనికి హోస్ట్ నాగార్జున తనదైన స్టైల్లో పరిష్కారం ఇచ్చాడు. ఆదివారం ఎపిసోడ్ లో నామినేషన్స్ లో ఉన్నవారిని సేఫ్ చేస్తూ వచ్చాడు నాగార్జున. ఇందులో భాగంగా షణ్ముక్, మానస్, శ్రీరామ్, రవి, సిరి ఈ ఐధుగురు సేఫ్ జోన్ లోకి వచ్చారు.

మిగిలిన లోబోని ఈసారి ఎలిమినేట్ చేసేసింది బిగ్ బాస్ టీమ్. నిజానికి అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ లో కూడా లోబోనే లీస్ట్ లో ఉన్నాడు. లాస్ట్ మూడు నాలుగు వారాల నుంచీ లోబో బయటకి వచ్చేస్తాడనే చాలామంది అనుకున్నారు. కానీ 8వారాల పాటు తనదైన స్టైల్లో గేమ్ ఆడాడు.లోబోకి ప్రతి చోట ఓటింగ్ తక్కువ పర్సెంట్ లో నమోదు అయ్యింది. ఫస్ట్ నామినేషన్స్ లోకి వచ్చినదానికంటే కూడా ఇది చాలా తక్కువ. తనకంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉండటం అనేది లోబోకి మైనస్ అయ్యింది.

ఇక 6వ వారం లోబోని ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్ లో పెట్టిన సంగతి తెలిసిందే. సీక్రెట్ రూమ్ కి వెళ్లి వచ్చినా కూడా లోబో ఆటతీరులో ఏమార్పు రాలేదు. అంతేకాదు, బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ లు ఆడటంలో కూడా పెద్దగా ఆసక్తిని చూపించడం లేదు లోబో. అందుకే బిగ్ బాస్ లవర్స్ ఎవ్వరూ కూడా లోబోకి ఓటు వేయలేదు. లోబో ఎలిమినేట్ అవ్వక తప్పలేదు. అదీ మేటర్.

[yop_poll id=”4″]

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus