Bigg Boss 5 Telugu: రవి విషయంలో లోబో చేసింది కరెక్టేనా..?

బిగ్ బాస్ హౌస్ లో సన్నీ కొత్త కెప్టెన్ గా మారినప్పటి నుంచీ రూల్స్ మారతాయని నాగార్జునకి ప్రామిస్ చేశాడు. అలాగే వీకెండ్ తోపు డూపు ఆట ఆడించాడు నాగార్జున. నిజానికి ఇది హౌస్ మేట్స్ అందరితో ఆడించి ఉండాల్సిన ఆట. టైమ్ లేకపోవడం వల్ల ఒక్క లోబోనే సీక్రెట్ గా రమ్మని చెప్పి అందరి గురించి అడిగాడు. ఇక్కడే రవికి షాక్ ఇచ్చాడు లోబో. రవిని డూపు అంటూ చెప్తూ తన మనసులో మాటల్ని పంచుకున్నాడు.

ఫస్ట్ డూపుల గురించి మాట్లాడాడు. ఫస్ట్ ప్రియాంక పేరు చెప్పాడు డూపు మాటలు మాట్లాడుతుంది అని, అలాగే కాజల్ పేరు చెప్పి ఇలాంటి జనాలు నాకు నచ్చరని, ఊసరవెల్లి లాంటిది అని చెప్పాడు. నెక్ట్స్ ప్రియ వెనక ఒక మాట ముందు ఒక మాట మాట్లాడుతుంది అని చెప్పాడు. ఇక్కడే రవి పేరు కూడా డూపు అని చెప్పాడు. దోస్తానా నడుస్తుది కానీ, గేమ్ గేమ్ లాగా ఆడాలి అది నేను ఒప్పుకుంటా కానీ, అవసరానికి మాత్రమే లోబో గుర్తుకువస్తాడు.., లేదంటే లేదు అంటూ చెప్పాడు లోబో. ఏదైనా మాట్లాడితే దోస్తానా అడ్డం వస్తుంది. ఇక నుంచీ నా గేమ్ నేను సింగల్ గా ఆడుకుంటా సింగల్ గా పోతా అని చెప్పాడు లోబో. అలాగే అనీమాస్టర్, ఇంకా షణ్ముక్ ఇద్దరూ కూడా డూపులే అని చెప్పాడు. షణ్ముక్ అయితే ఫేక్ స్మైల్ ఇస్తాడు అంటూ చెప్పాడు.

అలాగే తోపుల లిస్ట్ లో మానస్, సన్నీ, శ్రీరామ్, సిరి, జెస్సీ, విశ్వ పేర్లు చెప్పాడు. ఇక సీక్రెట్ రూమ్ నుంచీ వచ్చి అంతా గ్యాస్ కొట్టానంటూ ఫన్ చేయాలని చూశాడు లోబో. అంతేకాదు, ఈవారం బరాబర్ గేమ్ ఆడతా అని, నేను కెప్టెన్ అవుతానని చెప్పాడు లోబో. ఇలా రవి ఫ్రెండ్ ఫ్రెండ్ అనుకుంటూ ఉంటే రవిని డూపు అని చెప్పి షాక్ ఇచ్చాడు లోబో. రవి కూడా ఒక్కసారిగా షాక్ తిన్నాడు. అసలు రవి విషయంలో లోబో చెప్పిన మాటలు కరెక్టేనా కాదా అనేది ఇప్పుడు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus