ఈ ఏడాది విడుదలవుతున్న సినిమాలలో ఒకటైన వకీల్ సాబ్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అజ్ఞాతవాసి మూవీ తరువాత సినిమాలకు దూరమైన పవన్ రీఎంట్రీ కోసం పింక్ రీమేక్ ను ఎంచుకున్నారు. ఈ సినిమాకు కేవలం రెండు సినిమాల అనుభవం ఉన్న దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. పవన్ రీఎంట్రీ సినిమా కావడంతో కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఈ సినిమాలో పవన్ లాయర్ గా నటించనుండగా శృతిహాసన్ గెస్ట్ రోల్ లో నటించనున్నారు. బోనీకపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కలెక్షన్లపరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఈ సినిమాపై భారీగా అంచనాలను పెంచిన సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ సినిమా థియేట్రికల్ హక్కులు 100 కోట్ల రూపాయలకు పైగా అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడైనట్లు తెలుస్తోంది.
దిల్ రాజు కొన్ని ఏరియాల్లో ఈ సినిమాను సొంతంగా విడుదల చేయనున్నారు. యూరప్ దేశాల్లో ఈ సినిమా విడుదల కావడం లేదని కరోనా, లాక్ డౌన్ వల్లే ఈ సినిమా అక్కడ విడుదల కావడం లేదని తెలుస్తోంది. యూరప్ దేశాల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూ ఉండటంతో అక్కడ లాక్ డౌన్ అమలవుతోంది. అక్కడి లోకల్ మూవీస్ సైతం లాక్ డౌన్ వల్ల ఆగిపోయిన నేపథ్యంలో వకీల్ సాబ్ పై కూడా ఆ ప్రభావం పడుతోంది. యూరప్ దేశాల్లో విడుదల ఆగిపోవడంతో ఆ ప్రభావం కలెక్షన్లపై పడే అవకాశం ఉంది.