ఒక సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడు తర్వాతి సినిమాను ఓకే చేసుకుంటారు అని యువ దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌కి పేరు. ఆయన స్టార్ దర్శకుడ అయ్యాక ఇప్పటివరకు చేసిన సినిమాలు అలానే సాగాయి. ఇప్పుడు చేస్తున్న ‘కూలీ’ కూడా అలా మధ్యలోనే ఓకే అయింది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి రెండు మూడు సినిమాలను లోకేశ్ ఓకే చేసేసుకున్నారు. అందులో ఆమిర్ ఖాన్ సినిమా ఒకటి. త్వరలోనే ఈ సినిమా అనౌన్స్‌మెంట్ అఫీషియల్‌గా బయటకు వస్తుంది. అయితే ఫార్మల్ అనౌన్స్‌మెంట్ అయిపోయిన సంగతి తెలిసిందే.
దీని వెనుక పెద్ద కథే జరిగింది అని లోకేశ్ కనగరాజ్ చెప్పారు. ఇటీవల ఈ ఇంటర్వ్యూలో ఆ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఆమిర్ ఖాన్‌తో తన సినిమా ఉందని.. అయితే అది ‘ఖైదీ 2’ సినిమా తర్వాత ఉంటుంది అని చెప్పారు. ఈ క్రమంలో ఈ సినిమా గురించి ఆమిర్ ఓ ప్రెస్ మీట్‌లో అనౌన్స్ చేయడం గురించి కూడా మాట్లాడారు.
ఓసారి లోకేశ్‌కు ఆమిర్ ఫోన్ చేసి ‘సితారే జమీన్ పర్’ సినిమా ప్రచారం చేస్తున్నానని.. ఆ ప్రచారంలో మన సినిమా గురించి చెప్పొచ్చా అని అడిగారట. ‘తాను మీడియా ముందు విషయం దాచలేను. నాకు అది కరెక్ట్ అనిపించదు. అందుకే మన సినిమా గురించి అడిగితే చెప్పేస్తా.. ఫర్వాలేదు కదా’ అని ఆమిర్ అడిగారట. దీంతో లోకేశ్ కనగరాజ్ మీ ఇష్టం సార్.. చెప్పేస్తానంటే చెప్పేయండి అని అన్నారట.
ఆ తర్వాతే ఆమిర్ తన ప్రెస్ మీట్స్‌లో లోకేశ్ కనగరాజ్‌తో చేయబోయే సినిమా గురించి బయటకు చెప్పారట. ఇక ఈ సినిమా దేశంలోనే అతి పెద్ద యాక్షన్ సూపర్ హీరో నేపథ్యంలో సాగుతుందని లోకేశ్ చెప్పారు. ఈ సినిమా హిందీ ప్రాజెక్ట్ అని చెప్పలేమని.. గ్లోబల్ ప్రాజెక్ట్ అని హైప్‌ను పెంచే ప్రయత్నం చేశారు.