LCU: కమల్ – విజయ్ తో లోకేష్ పవర్ఫుల్ ప్లాన్!

Ad not loaded.

లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) తన సినిమాలతో హవా చూపిస్తూనే ఉన్నాడు. ఖైదీ(Kaithi) , ‘విక్రమ్‌’(Vikram), ‘లియో’(LEO) లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో తనకంటూ ఓ యూనివర్స్ క్రియేట్ చేసుకున్న అతడు, ఇప్పుడు ఖైదీ 2పై పూర్తి దృష్టి పెట్టాడు. కార్తీ హీరోగా మరోసారి తెరకెక్కుతున్న ఈ మాస్ యాక్షన్ థ్రిల్లర్‌లో, మాస్ ఎలిమెంట్స్‌కు కొదవ లేకుండా భారీ ప్లాన్ వేశారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా పూర్తవుతున్నాయి. ప్రస్తుతం లోకేష్ కూలీ(Coolie) షూటింగ్ పూర్తి చేసుకునే పనిలో ఉన్నప్పటికీ, ఖైదీ 2 బ్యాక్‌గ్రౌండ్ వర్క్‌ను అతని టీమ్ స్పీడ్‌గా కంప్లీట్ చేస్తోంది.

Kaidhi 2

అయితే, ఈ సినిమాలో పెద్ద ట్విస్ట్ ఏంటంటే.. కమల్ హాసన్ (Kamal Haasan) కూడా ఇందులో భాగం కావడమే. ఆయన పాత్ర చిన్నదే అయినప్పటికీ, విక్రమ్ 2కు బ్రిడ్జ్ వేసేలా స్ట్రాంగ్ క్యారెక్టర్‌తో రానున్నారని టాక్. ఇందులో మాత్రమే కాదు, లోకేష్ యూనివర్స్‌లో మరింత ఇంటెన్సిటీ పెంచేందుకు సూర్య (Suriya) పోషించిన రోలెక్స్ క్యారెక్టర్ కూడా కంటిన్యూ అవుతుందని తెలుస్తోంది.

ఈ పాత్రను మునుపటి కన్నా పవర్‌ఫుల్‌గా చూపించేందుకు స్క్రిప్ట్ డెవలప్ చేస్తున్నారు. ఇంకా ఊహించని కొన్ని కొత్త క్యారెక్టర్స్ కూడా స్టోరీలోకి ఎంటర్ అవుతాయని టాక్ నడుస్తోంది. ఇక కమల్ హాసన్ క్యారెక్టర్ విషయానికి వస్తే, సినిమాలో కీలకమైన క్లైమాక్స్ ఎపిసోడ్‌లో విక్రమ్ పాత్ర ప్రత్యక్షమయ్యేలా ప్లాన్ చేశారని సమాచారం. ఈ సీన్‌లో విజయ్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారని కోలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. అలా ఖైదీ 2 ద్వారా లోకేష్ తన యూనివర్స్‌ను మరింత విస్తరించబోతున్నట్లు స్పష్టమవుతోంది.

ప్రస్తుతం లోకేష్ కూలీ సినిమాతో బిజీగా ఉన్నాడు. రజనీకాంత్ (Rajinikanth) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఆగస్టులో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఆ వెంటనే ఖైదీ 2 షూటింగ్‌కు రెడీ అవుతాడట. మొత్తం మీద లోకేష్ కనగరాజ్ తన యూనివర్స్‌ను మరింత మాస్‌గా మలుచుకునేందుకు రెడీ అవుతున్నాడు. ఖైదీ 2లో కార్తీ (Karthi) యాక్షన్‌కు కమల్, సూర్య, విజయ్ (Vijay Thalapathy) లాంటి హైపర్ క్యారెక్టర్లు తోడైతే.. ఇంకేమైనా ఉందా.. బాక్సాఫీస్ బ్లాస్ట్ అవ్వడం పక్కా.

అవును నేను డ్రింక్ చేస్తాను.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus