లోకేష్ కనగరాజ్.. ఇప్పుడు ఇండియాలో ఉన్న టాప్ డైరెక్టర్స్ లో ఒకరు. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. లోకేష్ కనగరాజ్ సినిమా అంటే.. ఆడియన్స్ లో కూడా నమ్మకం పెరిగింది. ‘ఖైదీ’ ‘విక్రమ్’ సినిమాలు లోకేష్ రేంజ్ ను పెంచాయి. లోకేష్ తో సినిమాలు చేయడానికి ఇప్పుడు నిర్మాతలు ఎగబడుతున్నారు. అతనితో సినిమా చేస్తే లాభాలు కన్ఫర్మ్. అయితే అంతకు ముందు లోకేష్ కి మొదటి అవకాశం ఇవ్వడానికి చాలా మంది ఆలోచించారు.
లోకేష్ కి మా నగరం’ తో ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన సందీప్ కిషన్.. టాలీవుడ్లో ఉన్న నిర్మాతలందరి వద్దకు లోకేష్ ను తీసుకెళ్లి పరిచయం చేసినా.. అతన్ని ఎవరూ నమ్మలేదు. అలాంటి టైంలో కార్తీ ‘ఖైదీ’ చేసుకునే అవకాశం ఇచ్చాడు. వాస్తవానికి ‘ఖైదీ’ సినిమా పై మొదట అంచనాలు లేవు. కార్తీ వైవిధ్యమైన సినిమాలు చేస్తాడు కాబట్టి.. మినిమమ్ గ్యారంటీ అనే ముద్ర ఉంది కాబట్టి.. వెళ్లి ‘ఖైదీ’ ని చూశారు. అయితే ‘ఖైదీ’ ని లోకేష్ తీర్చిదిద్దిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ఆ వెంటనే విజయ్ వంటి స్టార్ హీరోలు లోకేష్ కి అవకాశాలు ఇచ్చారు.
అయితే ఇటీవల ‘కూలీ’ ప్రమోషన్స్ లో పాల్గొన్న లోకేష్ ను ఓ రిపోర్టర్ ‘వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తుండటం వల్ల.. కార్తీ వంటి మిడ్ రేంజ్ హీరోతో ‘ఖైదీ 2′ చేయడానికి ఇబ్బంది పడుతున్నారా? అందుకే ఆ ప్రాజెక్టు వెనక్కి వెళ్తుందా’ అంటూ ప్రశ్నించింది. వాస్తవానికి అది నిజమే. 2019 లో ‘ఖైదీ’ వచ్చింది. ఆ వెంటనే ‘ఖైదీ 2’ సెట్స్ పైకి వెళ్ళాలి. కానీ లోకేష్ కి ‘మాస్టర్’ ‘విక్రమ్’ ‘లియో’ ‘కూలీ’ వంటి బడా సినిమాలు చేసే ఛాన్స్ వచ్చింది.
ఈ రేంజ్ ఫామ్లో ఉన్నప్పుడు కార్తీ వంటి మిడ్ రేంజ్ హీరోతో సినిమా చేయడానికి.. స్టార్ దర్శకులు ఆలోచనలో పడతారు. కానీ లోకేష్ అందరిలాంటి స్టార్ డైరెక్టర్ కాదు. చెప్పిన బడ్జెట్లో, తక్కువ రోజుల్లో సినిమాని కంప్లీట్ చేసేస్తాడు. అలాంటి ఆలోచనా శైలి కలిగిన దర్శకుడిని ఆ రిపోర్టర్ అడిగిన ప్రశ్న నొప్పించింది. అందుకే సాధ్యమైనంత త్వరగా ‘ఖైదీ 2’ ని కార్తీతో తెరకెక్కించి.. అలాంటి కామెంట్లకు ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తున్నాడు. అది మేటర్.