Love Me: ‘లవ్ మీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!
- May 25, 2024 / 08:06 PM ISTByFilmy Focus
‘రౌడీ బాయ్స్’ (Rowdy Boys) తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన దిల్ రాజు (Dil Raju) వారసుడు ఆశిష్ (Ashish Reddy).. తన రెండో సినిమాగా ‘లవ్ మీ’ (Love Me) (ఇఫ్ యు డేర్ అనేది ఉపశీర్షిక) చేశాడు. ‘బేబీ’ (Baby) ఫేమ్ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ‘దిల్ రాజు ప్రొడక్షన్స్’ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి (Harshith Reddy) , హన్షిత రెడ్డి (Hanshitha Reddy) , నాగ మల్లిడి కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అరుణ్ భీమవరపు దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్, పాటలు ప్రేక్షకుల నుండీ మంచి రెస్పాన్స్ ను రాబట్టుకున్నాయి.

కీరవాణి (MM Keeravani) , పీసీ శ్రీరామ్ (P. C. Sreeram) వంటి లెజెండ్స్ కూడా ఈ సినిమాకి చేయడం జరిగింది.మే 25న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ ఎలా జరిగిందో? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో తెలుసుకుందాం రండి :
| నైజాం | 2.50 cr |
| సీడెడ్ | 0.70 cr |
| ఆంధ్ర(టోటల్) | 2.80 cr |
| ఏపీ + తెలంగాణ | 6.00 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.05 cr |
| ఓవర్సీస్ | 0.20 cr |
| వరల్డ్ వైడ్ టోటల్ | 6.25 cr |
‘లవ్ మీ’ చిత్రం రూ.6.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. పాజిటివ్ టాక్ వస్తే.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. టీజర్, ట్రైలర్స్ ఆకట్టుకున్నాయి కాబట్టి.. సినిమా కూడా ఆ స్థాయిలో ఉంటే టార్గెట్ ఈజీనే అని చెప్పాలి.












