టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. ఇండస్ట్రీ ఏదైనా భారతీయ చిత్ర పరిశ్రమలో కో స్టార్స్ ని ప్రేమించి పెళ్లాడిన నటీనటులు ఎందరో ఉన్నారు. వీటిలో కొన్ని కథలు కంచికి చేరితే.. కొన్ని మాత్రం పీటల వరకు వచ్చి ఆగిపోయాయి. ఇంకొన్ని వాటి విషయానికి వస్తే.. ఇద్దరికి ప్రేమ ఉన్నా రకరకాల కారణాలతో మనసులోనే దాచుకునేవారు. ఈ కోవకు చెందినదే రాజేంద్ర ప్రసాద్ – రజనీ ల స్టోరీ. ఆ రోజుల్లోనే రాజేంద్రప్రసాద్ అందాల తార రజనీ మధ్య ఏదో ఉంది అని ఇండస్ట్రీ , తెలుగు మీడియా కోడై కూసింది.
1987లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘‘ఆహా నా పెళ్లంట’’ సినిమాతో మొదలైన వీరిద్దరి జర్నీ ఎన్నో సినిమాల వరకు సాగింది. భలే మొగుడు, గుండమ్మగారి కృష్ణులు, భామా కలాపం, జీవనగంగ, చిక్కడు దొరకడు, బంధువులొస్తున్నారు జాగ్రత్త, చలాకీ మొగుడు చాదస్తపు పెళ్లాం, గడుగ్గాయి వంటి సినిమాలతో రాజేంద్రప్రసాద్- రజినీలు హిట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడంటే హీరో హరోయిన్లు , టెక్నీషియన్లు చనువుగా ఉంటున్నారు .. కానీ 1980లలో భారతీయ సినిమా పంథానే వేరు.
కట్టుబాట్లు, రకరకాల సంప్రదాయాలు ఇంటా బయటా అమల్లో ఉండేవి. దర్శక నిర్మాతలు కూడా పాత తరం వాళ్ళు కాబట్టి.. ఎక్కడైనా తేడాగా కనిపిస్తే మందలించే వారు. ఈ నేపథ్యంలో నటీనటులు తమ పని తాము చేసుకుంటూ ఉండేవారు. ఈ క్రమంలో రజినీతో మాత్రం రాజేంద్రప్రసాద్ కాస్త చనువుగానే ఉండేవారు. అందుకే ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందని అప్పట్లో పుకార్లు షికారు చేశాయి. కానీ ఇవేవి పట్టించుకోకుండా వారిద్దరూ సినిమాలు చేసుకుంటూ వెళ్లారు. ఒకానొక సందర్భంలో రజనీ ఈ విషయంపై స్పందిస్తూ… తమ మధ్య స్నేహాన్ని చాలా మంది అపార్థం చేసుకున్నారని తెలిపారు .
ఇప్పటికీ తామిద్దరం మంచి మిత్రులుగానే కొనసాగుతున్నట్లు వెల్లడించింది. పదో తరగతిలోకి వెళ్లబోతుండగా 1984లో రజనీకి సినిమాల్లో అవకాశం వచ్చింది. ఎక్కడో ఆమెను చూసిన ప్రొడక్షన్ మేనేజర్.. పిల్ల అందంగా ఉంది, హీరోయిన్‌గా బాగుంటుందని డైరెక్టర్ మణివణ్ణన్‌కు చెప్పాడట. దీంతో వాళ్లు రజనీ వాళ్ల నాన్నను పిలిపించి విషయం చెప్పారు. దీనిపై వెంటనే నిర్ణయం తీసుకోలేని ఆయన.. ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను అడిగి ఏ విషయం చెబుతానని అన్నాడట. ఇది విన్న రజనీ వాళ్లమ్మ గారు… ఏదో లాగా ఆయనను ఒప్పించారు. అలా మణివణ్ణన్ దర్శకత్వంలో మోహన్ హీరోగా ‘‘ఇళమే కాలందు’’తో సినీరంగ ప్రవేశం చేశారు రజనీ.
Most Recommended Video
తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?