Love Story Movie: సరికొత్త రికార్డు క్రియేట్ చేయబోతున్న లవ్ స్టొరీ!

నాగచైతన్య సాయి పల్లవి కలిసి నటించిన మొదటి సినిమా లవ్ స్టోరీ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ సినిమా పై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి ఎందుకంటే వెండితెరపై ఒక మంచి ప్రేమ కథను చూసి చాలా కాలం అయ్యింది. తప్పకుండా ఈ సినిమా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటుందని ఇప్పటికే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది.

గతంలో నాగచైతన్య శైలజ రెడ్డి అల్లుడు సినిమాతో భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్నాడు ఇక ఈసారి శేఖర్ కమ్ముల సాయి పల్లవి కాంబినేషన్ కాబట్టి వీరి ముగ్గురి కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత అత్యధిక ఓపెనింగ్స్ తో అందుకున్న మొదటి ఇండియన్ సినిమాగా కూడా లవ్ స్టోరీ ఒక రికార్డు క్రియేట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వచ్చిన గోపీచంద్ సీటిమార్ సినిమా బాగానే ఓపెనింగ్స్ లో అందుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో సినిమా క్లిక్కవ్వలేకపోయింది.

కానీ లవ్ స్టోరీ మాత్రం తప్పకుండా హిట్ అవుతుందని అనుకుంటున్నారు. సినిమా మొదటివారంలోనే దాదాపు పెట్టిన పెట్టుబడి కూడా రికవరీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక యూఎస్ కూడా ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ అయితే భారీగా పెరిగిపోయాయి. అక్కడ కూడా సినిమా ఒక న్యూ రికార్డు క్రియేట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus