Love Today OTT: ఓటీటీలోకి లవ్ టుడే సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ప్రదీప్ రంగనాథన్ నటిస్తూ దర్శకత్వం వహించిన తమిళ సినిమా లవ్ టుడే. ఈ సినిమా మూడు వారాల క్రితం తమిళంలో విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. తమిళంలో ఈ సినిమా కలెక్షన్లు మోత మోగించింది. కేవలం 5 కోట్ల బడ్జెట్తో నిర్మితమైన ఈ సినిమా దాదాపుగా 60 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డులు సృష్టించింది. దీంతో లవ్ టు డే సినిమాను అదే పేరుతో నిర్మాత దిల్ రాజు తెలుగులోకి డబ్ చేశారు.

ఈ నెల 25న ఈ సినిమా థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. తెలుగులో కూడా ఈ సినిమా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ప్రేమ కథతో పాటు కామెడీ కూడా ఉండడంతో ప్రేక్షకు నువ్వు బాగా ఆదరిస్తున్నారు. ఇక ఇందులో ప్రదీప్ రంగనాథన్ సరసన ఇవాళ, రవీనా రవి హీరోయిన్లుగా నటించారు. అలాగే సత్యరాజ్‌, రాధికా, యోగిబాబు కీలకపాత్రల్లో నటించారు. ఇదిలా ఉంటే తాజాగా విడుదల అయ్యి థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న లవ్‌టుడే సినిమా అప్పుడే ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ లవ్‌టుడే డిజిటల్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఇందుకోసం భారీగానే డబ్బులు చెల్లించినట్లు సమాచారం. కాగా డిసెంబర్‌ 2న ఈ సినిమాను తమిళ భాషలో స్ట్రీమింగ్‌ కానుంది. త‌మిళంతో పాటు తెలుగు ఓటీటీలో కూడా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. కాగా ఈ సినిమా తెలుగులో క్రిస్మస్ కానుకగా స్ట్రీమింగ్ కానున్నట్టు సమాచారం. ఈ సినిమా తెలుగులో విడుదలైన మొదటి రోజే రూ. 2 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

సినిమా బాగుండడంతో ప్రేక్షకులు కూడా థియేటర్లకు భారీగా వస్తున్నారు. అయితే వసూళ్లు పెరుగుతున్న తరుణంలో ఓటీటీ రిలీజ్ డేట్‌ విడుదల చేయడం దిల్‌రాజుకు షాకింగ్‌ కలిగించే విషయమే అని చెప్పవచ్చు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus