సమంత స్టార్ గా ఎదగడం వెనుక ?

తెలుగు చిత్ర పరిశ్రమలో అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ స్థాయికి చేరిన నటి సమంత. ఏ మాయ చేసావే తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టి ఈగ, దూకుడు, అత్తారింటికి దారేది, మనం, అ..ఆ వంటి విజయాలను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం జనతా గ్యారేజ్ సినిమాలో తారక్ సరసన నాలుగో సారి నటిస్తోంది. ఇంతటి పేరును సొంతం చేసుకోవడానికి కారణం ఎవరు అని ఆమెను అడిగితే నిగర్విగా సమాధానం చెప్పింది.

‘నేనిప్పుడు ఈ స్థానంలో ఉన్నానంటే దానికి నా ప్రతిభ, కష్టం ఒక్కటే కారణం కాదు. నా శ్రమకు అదృష్టం కూడా తోడు అయింది కాబట్టి మంచి పేరు సంపాదించగలిగాను. నాకంటే కష్టపడేవాళ్లు, నాకంటే గొప్పోళ్లు పరిశ్రమలో చాలామంది ఉన్నారు. వారికి రాని గుర్తింపు నాకు వచ్చిందంటే ఎక్కడో సుడి ఉందని అర్ధం. అందుకే ఉదయం లేవగానే ఈరోజు నా స్థితికి కారణం ఏమిటి’ అని ఆలోచిస్తా. ఎంతోమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా సాయపడిన వారికి కృతజ్ఞతగా.. నేను కొంతమందికి అండగా నిలవాలని అనుకున్నాను.

ఆ ఆలోచనకు రూపమే ప్రత్యూష ఫౌండేషన్‌’’ అని సమంత వెల్లడించింది. ఈ సంస్థ ద్వారా గుండె జబ్బులతో బాధపడుతున్న పిల్లలకు ఆపరేషన్ చేయించారు. చైన్నై వరద భాదితులకు సాయం చేశారు. ఇలా అనేక సహాయ కార్యక్రమాలను చేస్తున్నారు. దీంతో ఇప్పటివరకు  బ్రెయిన్ విత్ బ్యూటీ అని పిలిచినా వారంతా ఇప్పుడు సమంతను బ్యూటీ విత్ హార్ట్ అని అభినందిస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus