ఇండస్ట్రీ జనాలు సెంటిమెంట్లకి పెద్ద పీట వేస్తుంటారు. ప్రేక్షకులకి మాత్రమే కాకుండా ఫిలిం మేకర్స్ కు కూడా రకరకాల సెంటిమెంట్లు ఉంటాయి. అదే విధంగా దగ్గుబాటి ఫ్యామిలీకి కూడా ఓ సెంటిమెంట్ ఉంది. అదే ‘ఫిబ్రవరి25’ సెంటిమెంట్. ఈ డేట్ ఆ ఫ్యామిలీకి 3 జనరేషన్లకు కలిసొచ్చింది.ఈరోజు విడుదలైన `భీమ్లా నాయక్` తో అది మరోమారు ప్రూవ్ అయ్యింది. ఇదిలా ఉండగా…రానా తాతగారు దగ్గుబాటి రామానాయుడు గారి నిర్మాణంలో `ముందడుగు` అనే చిత్రం 1983 వ సంవత్సరంలో ఫిబ్రవరి 25న విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఆ టైంకి నిర్మాత రామానాయుడు గారికి ఓ హిట్ కావాలి. ఆ టైములో ఆయన సూపర్ స్టార్ కృష్ణ, నటభూషణ శోభన్ బాబు ల కాంబోలో చేసిన ఈ మల్టిస్టారర్ ఘనవిజయం సాధించి ఎన్నో రికార్డులు సృష్టించింది.అదే విధంగా 1998 వ సంవత్సరంలో రానా బాబాయ్ విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ‘సూర్య వంశం’ ఫిబ్రవరి 25నే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఇక 2022 లో ఫిబ్రవరి 25నే(ఈరోజు) ‘భీమ్లా నాయక్’ రిలీజ్ అయ్యింది.
రానా కూడా ఇందులో ఓ హీరోనే..! ఈ చిత్రం కథంతా రానా పాత్ర చుట్టూనే తిరుగుతుంది. పవన్ కు ధీటుగా అతను పెర్ఫార్మ్ చేసి శభాష్ అనిపించుకున్నాడు. ఇగో ఉన్న డానియల్ శేఖర్ పాత్రని ఎంతో ఈజ్ తో పెర్ఫార్మ్ చేసి అందరి మన్నలను పొందుతున్నాడు. ఈ మధ్య కాలంలో రానా కి సరైన హిట్టు పడలేదు. ‘అరణ్య’ తో పాటు అనవసరంగా విడుదలైన ‘1945’ చిత్రాలు చేదు అనుభవాల్నే మిగిల్చాయి. ‘భీమ్లా’ విజయం రానా కెరీర్ కు కచ్చితంగా మంచి బూస్టప్ ను ఇచ్చే అవకాశం పుష్కలంగా ఉంది.
Most Recommended Video
‘భీమ్లా నాయక్’ తో పాటు పవన్ హీరోగా రీమేక్ అయిన 12 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!