‘సీతా రామం’ (Sita Ramam) తర్వాత దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) చేస్తున్న మరో స్ట్రైట్ తెలుగు మూవీ ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) . ‘కల్కి 2898 ad’ లో గెస్ట్ రోల్ ఇచ్చినప్పటికీ.. ఫుల్ లెంగ్త్ హీరోగా చేసింది ‘లక్కీ భాస్కర్’ అనే చెప్పాలి. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. వెంకీ అట్లూరి (Venky Atluri)దర్శకుడు. జి.వి.ప్రకాష్ (G. V. Prakash Kumar) సంగీత దర్శకుడు కాగా మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్. ‘శ్రీమతి గారు’ అనే పాటకు మంచి రెస్పాన్స్ లభించింది.
టీజర్, ట్రైలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఆల్రెడీ ఈ చిత్రాన్ని కొంతమంది సినీ పెద్దలు వీక్షించడం జరిగింది. దర్శకుడు త్రివిక్రమ్ (Trivikram) అయితే ‘లక్కీ భాస్కర్’ ని ఆకాశానికెత్తేసిన సంగతి తెలిసిందే. ‘లక్కీ భాస్కర్’ కథ విషయానికి వస్తే.. భాస్కర్ అనే బ్యాంక్ ఎంప్లాయ్ సుమతి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఫ్యామిలీ లైఫ్ వల్ల అతనికి జీతం సరిపోకపోవడంతో అప్పులు చేస్తుంటాడు. వాటికి వడ్డీలు పెరుగుతుంటాయి. టైంకి వాటిని చెల్లించడం లేదు అని..
అప్పు ఇచ్చిన వాళ్ళు అతని ఇంటికి వచ్చి గొడవ పెడుతున్నారు. దీంతో అతని భార్య కూడా బాధపడుతూ ఉంటుంది. ఇలాంటి టైంలో భాస్కర్ రిస్క్ చేసి తన వద్ద ఉన్న సేవింగ్స్ అంతా స్టాక్స్ లో పెడతాడు. దీంతో అతనికి బోలెడంత డబ్బు వచ్చి పడుతుంది. తర్వాత అనుకోకుండా చాలా ప్రాబ్లెమ్స్ కూడా వస్తుంటాయి. అవి ఏంటి? భాస్కర్ లైఫ్ చివరికి ఎలా అయ్యింది అనేది మిగిలిన కథగా తెలుస్తుంది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాడు ధనవంతుడు అవుతున్నాడు అంటే.. ఆ పాయింట్ కి కామన్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు.
లక్కీ భాస్కర్ లో కామన్ ఆడియన్ రిలేట్ అయ్యే సన్నివేశాలు చాలా ఉంటాయట. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే విధంగా ఈ సినిమా ఉంటుందని.., కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా చాలా ఉన్నాయని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్, నరసాపురం వద్ద ఉన్న పేరుపాలెం బీచ్ లొకేషన్స్ లో కూడా ‘లక్కీ భాస్కర్’ చిత్రీకరణ జరిపారట. అక్కడ తీసిన సన్నివేశాలు కూడా బాగా వచ్చాయట. మరి ప్రీమియర్స్ చూశాక ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.