గతంతో పోలిస్తే సినిమా సంగీతంలో చాలా మార్పులొచ్చాయి. అలనాటి ఘంటసాలతో మొదలుపెడితే ఇళయరాజా, రెహ్మాన్, ఇప్పటి తమన్ వరకు ఎన్నెన్నో పోకడలు. ఇవన్నీ కూడా మ్యూజిక్ ను ఇష్టపడేవారిని మెప్పిస్తున్నాయి. ఒకప్పుడు తెలుగులో స్వచ్ఛంగా పాడేవాళ్లనే ప్లే బ్యాక్ సింగర్స్ గా తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. భాష ఏదైనా సరే.. వాయిస్ బాగుందంటే వెంటనే తీసుకొచ్చి పట్టిస్తున్నారు.
ఉదిత్ నారాయణ్ కొన్నేళ్లపాటు తెలుగులో చక్రం తిప్పడానికి కారణం కూడా ఇదే. ఆయన తన పాటల్లో ఎన్ని తప్పులు పాడినా.. మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. గత కొంతకాలంగా సిద్ శ్రీరామ్ మీద కూడా ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి. ‘సర్కారు వారి పాట’ ప్రమోషన్స్ లో భాగంగా గీత రచయిత అనంత శ్రీరామ్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సిద్ శ్రీరామ్ ను సపోర్ట్ చేస్తూ ఆయన కొన్ని కామెంట్స్ చేశారు.
సిద్ శ్రీరామ్ సరిగ్గానే పాడుతున్నారని.. వింటున్నవారే పొరపాటు పడుతున్నారని ఆయన చెప్పడం ఆశ్చర్యంగా అనిపించింది. సిద్ ఉచ్ఛరణలో అసలు దోషమే లేదని సర్టిఫికెట్ ఇచ్చేశారు. టెక్నాలజీలో చాలా మార్పులు రావడం వలన ఫైనల్ సౌండ్ అవుట్ ఫుట్ లో కొంత తేడా అనిపించొచ్చని అంతే తప్ప.. అక్కడ సిద్ ఎలాంటి పొరపాటు చేయలేదని తేల్చి చెప్పారు.
ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఏ సినిమా అయినా.. అందులో సిద్ శ్రీరామ్ పాట కచ్చితంగా ఉండేలా చూసుకుంటున్నారు దర్శకనిర్మాతలు. ఆయన ఒక్కో పాటకు రూ.6 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. రీసెంట్ గా ఆయన పాడిన ‘కళావతి’ సాంగ్ కి 155 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం విశేషం.
Most Recommended Video
కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!