MAA Election: ‘మా’ ఎన్నికల్లో ఇప్పుడు ఇదే చర్చ!
- August 26, 2021 / 04:01 PM ISTByFilmy Focus
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు నగారా మోగింది. అక్టోబరు 10న ఎన్నికల్ని నిర్వహించనున్నట్టు ‘మా’ అధ్యక్షుడు నరేష్ అధికారికంగా ప్రకటించారు. 2021 – 23 కాలానికిగానూ జరగనున్న కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం పలువురు నటులు పోటీ పడతారు. ఇక్కడివరకు అంతా ఓకే. ‘పోటీలో మేం ఉన్నాం’ అంటూ చాలామంది ప్రకటించారు. మరి ఇందులో ఎవరు బరిలో ఉంటారు, ఎవరు బయటికొచ్చేస్తారు అనేది ఇప్పుడు ప్రశ్న. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే…
ప్రకాష్‌రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ, సీవీఎల్ నరసింహారావు తాము పోటీ చేస్తున్న విషయాన్ని వెల్లడించారు. తాజాగా నటుడు కాదంబరి కిరణ్ కూడా ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ఆరుగురు ఇప్పుడు ఎన్నికల్లో ఉంటారా? లేక ఎవరైనా వెనకడుగు వేస్తారా అనేది ఇప్పుడు ప్రశ్న. పరిస్థితి చూస్తుంటే ఈ ఆరుగురూ పోటీలో నిలవడం కష్టమే అంటున్నారు. ప్రకాశ్ రాజ్ కార్యవర్గానికి చిరంజీవి సపోర్టు ఉందనే విషయం మనకు తెలిసిందే.

మంచు విష్ణుకు నందమూరి బాలకృష్ణ మద్దతు పలికారు. మరో ఇద్దరు సీనియర్ నటుల మద్దతు కూడా ఉందంటున్నారు. జీవితకు ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్ మద్దతు ఉందని సమాచారం. హేమ, సీవీఎల్ నరసింహారావు కూడా తమకు మద్దతు ఉందనే అంటున్నారు. కాదంబరి కిరణ్ అయితే శివాజీరాజా పేరు చెబుతున్నారు. అయితే వీరిలో ఆఖరివరకు ఎవరు ఉంటారో చూడాలి. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ సమీకరణాలు మారుతాయి, ఎన్నికల విషయంలో పూర్తి క్లారిటీ వస్తుంది.
Most Recommended Video
చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!
















