షణ్ముక్ పై ఫిర్యాదు ఇస్తూ లాజిక్కులు మాట్లాడిన మానస్..!

  • December 5, 2021 / 04:48 PM IST

బిగ్ బాస్ హౌస్ లో శనివారం ఎపిసోడ్ చాలా రసవత్తరంగా జరిగింది. నాగార్జున హౌస్ మేట్స్ కి చురకలు అంటిస్తూనే వాళ్లకి కౌంటర్స్ వేస్తూ తనదైన స్టైల్లో రెచ్చిపోయాడు. ప్రతి హౌస్ మేట్ కి కౌంటర్స్ పడుతూనే ఉన్నాయి. ఇక్కడే బిగ్ బాస్ ఫిర్యాదుల పెట్టెలో హౌస్ మేట్స్ పై ఈవారం ఏదైనా కంప్లైట్స్ ఉంటే వేయమని చెప్పాడు కింగ్ నాగార్జున. దీంతో అందరూ ఒక్కొక్కరి పేరు రాసి వారితో ఉన్న ప్రాబ్లమ్స్ ని చెప్పుకున్నారు. మానస్ షణ్ముక్ పై కంప్లైంట్ ఇస్తూ లాజికల్ గా లాక్ చేశాడు. ఏదైనా విషయం ఉంటే సన్నీతో డైరెక్ట్ గా మాట్లాడుకుంటా అని చెప్పే షణ్ముక్, టాస్క్ లో మాత్రం నాతో సన్నీతో చెప్పు అంటూ ఎలా మాట్లాడతాడు అంటూ కంప్లైంట్ ఇచ్చాడు.

ప్రతిసారి సన్నీతో ఇష్యూ ఉంటే నువ్వెందుకు మాట్లాడుతున్నావ్ అంటాడు అని, కానీ ఐస్ టబ్ టాస్క్ జరిగేటపుడు నేను సిరిని కాల్ తీయమని చెప్తుంటే, మీ ఫ్రెండ్ కి కూడా చెప్పు అంటూ షణ్ముక్ ఎలా అడుగుతాడు అని ఫిర్యాదు చేశాడు. దీంతో షణ్ముక్ కాసేపు ఆలోచనలో పడ్డాడు. కేవలం సిరికి మాత్రమే కాదు, సిరితోపాటుగా సన్నీకి కూడా చెప్పు ఇద్దరూ ఎగ్రెసివ్ గా గేమ్ ఆడుతున్నారు కదా అనేదే నా ఉద్దేశ్యం అంటూ షణ్ముక్ కవర్ చేశాడు. కానీ, మానస్ మాత్రం తన పాయింట్ ని అక్కడ కూడా లాజికల్ గా వర్కౌట్ చేశాడు. ఇక్కడే కింగ్ నాగార్జున కూడా మానస్ పై ఒక ఫిర్యాదు చేశాడు. టైమ్ టాస్క్ లో నీకు నువ్వు బాగా కౌంట్ చేస్కుని ఫస్ట్ వచ్చావ్, మరి సన్నీ విషయంలో ఎందుకు ఎక్కువ కౌంట్ చేశావ్ అంటూ అడిగాడు.

పింకీ, కాజల్ ఇద్దరూ కూడా నన్ను కన్ఫూజ్ చేశారని, నేను బహుశా 20 నిమిషాలే లెక్కపెట్టానా అని డౌట్ వచ్చి, కాస్త సన్నీ విషయంలో ఎక్కువ కౌంట్ చేస్తూ చెప్పాల్సి వచ్చిందని అన్నాడు. ఇక కాజల్ కి కూడా నాగార్జున క్లాస్ పీకాడు. సౌండ్స్ విషయంలో అందరూ రిక్వస్ట్ చేస్తున్నా మాట్లాడుతునే ఉన్నావ్, పైగా ఆన్సర్స్ కూడా పైకి చెప్తున్నావ్ ఇదేనా గేమ్ అంటూ అడిగాడు. దీంతో కాజల్ బిగ్ బాస్ కి సారీ చెప్పింది. హౌస్ మేట్స్ కి కూడా సారీ చెప్పింది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus