Maanas, Sunny, Kajal: కాజల్ చేసిన ఆ పనివల్లే మానస్ పింకీగా మారాడా..?

బిగ్ బాస్ హౌస్ లో రోల్స్ ప్లే టాస్క్ నడుస్తోంది. ఇందులో భాగంగా గడిచిన సంఘటనలని మరోసారి గుర్తుచేసుకుంటూ ఒకరికొకరు పాత్రలని మార్చుకుంటూ ఎంటర్ టైన్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు. అలా బెస్ట్ పెర్ఫామన్స్ ఇచ్చిన వారికి పబ్లిక్ ని నేరుగా ఓట్లు అడిగే అర్హత లభిస్తుందని చెప్పాడు. ఇందులో భాగంగా ముందుగా అప్పడం టాస్క్ చేయమంటూ ఆదేశించాడు. దీంతో సిరిగా షణ్ముక్, సన్నీగా సిరి మారారు. మద్యలో సన్నీ షణ్ముక్ గా మారి ఫన్ చేశాడు. ఇక్కడే కాజల్ గా మారిన శ్రీరామ్ అనీమాస్టర్ లాగా ఉన్న మానస్ తో గొడవకి దిగాడు. ఇద్దరూ గొడవ పడుతుంటే మానస్ అనీమాస్టర్ ని ఇమిటేట్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ ఫన్ చేశాడు. ఇక సన్నీ షణ్ముక్ ఇన్నర్ వాయిస్ ని కూడా ఇమిటేషన్ చేశాడు. దీంతో షణ్ముక్ కి బాగా కాలింది. అలా వెకిలిగా ఇంకోసారి చేయకు అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇక తనకి తాను బ్రేక్ లు వేసుకున్న సన్నీ షణ్ముక్ తో సారీ చెప్పాడు. మానస్ అండ్ కాజల్ తో ఈవిషయాన్ని షేర్ చేసుకున్నాడు.

ఇక ఆ తర్వాత ప్రియాంక సింగ్ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినప్పటి నుంచీ మానస్ తో తన జెర్నీ ఎలా సాగిందో చూపించమని చెప్పాడు. దీంతో సన్నీ ప్రియాంక సింగ్ గా మారాడు. కాజల్ మానస్ పాత్రని చేస్తానంటూ ఉత్సాహపడింది. ఇక్కడే జెస్సీగా షణ్ముక్, శ్రీరామ్ గా సిరి, లోబోగా శ్రీరామ్, సన్నీపాత్రలో మానస్ ఉన్నారు. ఇక్కడే కాజల్ మానస్ గెటప్ లో ప్రియంకలాగా ఉన్న సన్నీతో ఐలవ్ యూ అంటూ చెప్పింది. అక్కడే ఉన్న మానస్ కి ఇది నచ్చలేదు. స్ట్రయిట్ గా అలా చేయద్దంటూ చెప్పి, కోపంగా హౌస్ లోకి వెళ్లిపోయాడు. ఇక్కడే మానస్ బాధపడుతుంటే వచ్చి సన్నీ కన్విన్స్ చేయబోయాడు. కానీ మానస్ వినలేదు. ఇద్దరూ కాసేపు ఆర్గ్యూ చేసుకున్నారు.

ఉన్నది ఉన్నట్లు చేయమని నాకు అలా చేయడం నచ్చదని సీరియస్ గా చెప్పాడు మానస్. దీంతో కాజల్ మానస్ క్యారెక్టర్ చేయట్లేదంటూ విరమించుకుంది. సన్నీ కూడా పింకీ గెటప్ నువ్వు వెయ్యి అంటూ మానస్ కి ఇచ్చేశాడు. దీంతో మానస్ పింకీగా, సన్నీ మానస్ గా మారి కాసేపు ఎంటర్ టైన్ చేశారు. కాజల్ సన్నీ గెటప్ లో అటూ ఇటూ తిరుగుతూ సందడి చేసింది. ఇక్కడే ఈ ముగ్గురు తమ ఫ్రెండ్షిప్ బాండింగ్ ఎంత గొప్పదో చూపించారు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus