Bigg Boss 5 Telugu: కెప్టెన్సీ టాస్క్ లో జరిగింది ఇదే..!

బిగ్ బాస్ హౌస్ లో 11వ వారం కెప్టెన్సీ టాస్క్ అనేది అనేది చాలా ఇంట్రస్టింగ్ గా మారింది. ఫస్ట్ కెప్టెన్సీ పోటీదారులుగా మానస్ అండ్ పింకీ బెలూన్ టాస్క్ ఆడిన సంగతి తెలిసిందే. ఇందులో ఎక్కువ బెలూన్స్ పేల్చిన పింకీ ఫస్ట్ కంటెస్టెంట్ అయ్యింది. ఆ తర్వాత సిరికి మానస్ సపోర్ట్ చేయడం వల్ల సెకండ్ కంటెస్టెంట్ అయ్యింది. ఇక్కడే మూడో కంటెస్టెంట్ గా అనీమాస్టర్ వచ్చినట్లుగా చెప్తున్నారు.

అనీమాస్టర్ కి వచ్చిన ఛాలెంజ్ లో గెలిచి మూడో కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచారట. ఇక మరోవైపు నాలుగో పార్టిసిపెంట్ గా మానస్ ఎంపిక అయ్యాడని, నిజానికి కాజల్ కి ఈ అవకాశం రావాల్సి ఉందని , ఎందుకని వదులుకుందో అని చెప్తున్నారు. ఇక ఈ నలుగురు మద్యలో జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో మానస్ విన్నర్ గా నిలిచాడట. ఎప్పట్నుంచో మానస్ కెప్టెన్ అవ్వాలనుకున్నాడని ఇప్పుడు అది జరిగిందని అంటున్నారు. ఇక రేషన్ మేనేజర్ గా సిరిని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.

హౌస్ మేట్స్ సహకారంతోనే మానస్ కెప్టెన్ అయినట్లుగా చెప్తున్నారు. ఇక టాస్క్ లో మరోసారి సన్నీకి మానస్ కి క్లాష్ అయ్యిందని, ఇద్దరు ఫ్రెండ్స్ మద్యలో చిన్నపాటి ఘర్షణ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. టీషర్ట్స్ లేబుల్ లొల్లి కూడా హౌస్ లో చాలాసేపు నడించిదని సన్నీకి మరో పవర్ ఇస్తానన్నా కూడా ఆటలో వద్దని చెప్పి రిజక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే, సన్నీ ఈగేమ్ ని ఎలా ఎండ్ చేశాడు అనేది ఆసక్తికరం.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus