నితిన్- కృతి శెట్టి జంటగా నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’ నిన్న(ఆగస్టు 12న) విడుదలయ్యి నెగిటివ్ టాక్ ను మూటకట్టుకుంది. డెబ్యూ దర్శకుడు ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి తెరకెక్కించిన మూవీ ఇది. ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన పాటలు, టీజర్ వంటివి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ట్రైలర్ కు కూడా సూపర్ రెస్పాన్స్ లభించింది. రొమాంటిక్,కామెడీ ఎలిమెంట్స్, యాక్షన్ ఎలిమెంట్స్ తో… ‘మాచర్ల నియోజకవర్గం’ ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
కానీ మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ రావడంతో రెండో రోజు నుండి కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి.ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:
నైజాం
2.76 cr
సీడెడ్
1.31 cr
ఉత్తరాంధ్ర
1.17 cr
ఈస్ట్
0.78 cr
వెస్ట్
0.36 cr
గుంటూరు
0.83 cr
కృష్ణా
0.60 cr
నెల్లూరు
0.43 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
8.24 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.44 cr
ఓవర్సీస్
0.37 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
9.05 cr
‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రానికి రూ.18.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.19 కోట్ల షేర్ ను రాబట్టాలి. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.9.05 కోట్ల షేర్ ను రాబట్టింది.బ్రేక్ ఈవెన్ కు మరో రూ.9.95 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. బింబిసార, సీతా రామం వంటి చిత్రాలు ఇంకా స్ట్రాంగ్ గా రన్ అవుతున్నాయి.
కార్తికేయ 2 కూడా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని అత్యధిక కలెక్షన్లను రాబడుతోంది. వాటి మధ్య ఈ మూవీ నలిగిపోయింది అని స్పష్టమవుతుంది. వీక్ డేస్ లో ఈ మూవీ నిలబడే అవకాశాలు అయితే చాలా తక్కువగానే ఉన్నాయి.