Macherla Niyojakavargam Trailer: మాస్ ఆడియన్స్ కి ఫుల్ ఫీస్ట్.. ట్రైలర్ అదిరింది..!

నితిన్- కృతి శెట్టి జంటగా నటిస్తున్న మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’. ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రం నుండి విడుదలైన పాటలు, టీజర్ వంటివి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ట్రైలర్ ను స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేశారు.రొమాంటిక్ అండ్ కామెడీ ఎలిమెంట్స్ తో ‘మాచర్ల నియోజకవర్గం’ ట్రైలర్ మొదలైంది. అటు తర్వాత సిద్ధార్థ్ రెడ్డి(నితిన్) మాచర్లలోకి ప్రవేశించినప్పుడు అక్కడ పూర్తిగా యాక్షన్‌ వాతావరణం కనిపించింది.

రాజప్ప(సముద్రఖని) అక్కడ ఎలక్షన్స్ జరగకుండా చేసి ప్రజలను అణగదొక్కుతూ ఉంటాడు.ఎదురు తిరిగిన వారిని హతమారుస్తూ ఉంటాడు. అది ప్రభుత్వ అధికారులైనా సరే. ఇలాంటి ఏరియాలోకి వచ్చిన సిద్దార్థ్ రెడ్డి అతన్ని ఎలా ఎదుర్కొన్నాడు అనేది మెయిన్ పాయింట్. కథ పాతగానే అనిపిస్తున్నా.. ఇందులో మాస్ ఎలిమెంట్స్ ఫుల్ గా ఉన్నాయి. “నువ్వేమో త్రివిక్రమ్ శ్రీనివాస్ ల పంచులు, వీళ్ళేమో బోయపాటి శ్రీనుల యాక్షన్.. ఇప్పుడు నేనేం చెయ్యాలి రాజమౌళి హీరో లా ఎలివేషన్ ఇవ్వాలా” – అంటూ నితిన్ చెప్పిన డైలాగ్ హైలెట్ గా నిలిచింది.

ట్రైలర్ మళ్ళీ మళ్ళీ చూసే విధంగా చేస్తుంది అనడంలో సందేహం లేదు. ప్రసాద్ మూరెళ్ల అద్భుతమైన విజువల్స్, మాస్ డైలాగ్స్ మరియు మహతి స్వర సాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ ట్రైలర్ కు హైలెట్ గా నిలిచాయి అని చెప్పొచ్చు. ‘శ్రేష్ఠ్ మూవీస్’ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్ గా కనిపిస్తున్నాయి. జనాలను థియేటర్ కు తీసుకొచ్చే సినిమా ‘మాచర్ల..’ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ అందరికీ కలిగించేలా ట్రైలర్ ఉంది. 3 నిమిషాల రెండు సెకన్ల ఈ ట్రైలర్ నితిన్ అభిమానులకు, మాస్ ఆడియన్స్ కి ఫుల్ ఫీస్ట్. మీరు కూడా ఓ లుక్కేయండి :

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!


అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus