MAD Collections: ‘మ్యాడ్’ మొదటి వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించి హిట్ లిస్ట్ లోకి చేరిపోయింది

‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయమైన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’. సూర్యదేవర నాగ వంశీ సమర్పించిన ఈ సినిమాకి ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంతో అనుదీప్ శిష్యుడు కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ వినోదాత్మక చిత్రంలో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ ప్రధాన పాత్రలు పోషించారు.

అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రీమియర్ షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 1.32 cr
సీడెడ్ 0.48 cr
ఉత్తరాంధ్ర 0.95 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 1.75 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
+ ఓవర్సీస్
0.52 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 3.27 cr

‘మ్యాడ్’ (MAD) చిత్రానికి రూ.1.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.1.8 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. మొదటి వీకెండ్ కే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించి రూ.3.27 కోట్ల షేర్ ను రాబట్టింది. ఆల్రెడీ సూపర్ హిట్ గా నిలిచిన ఈ మూవీ.. రాబోయే రోజుల్లో ఇంకా కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus