Mad Square Collections: ‘మ్యాడ్ స్క్వేర్’ వీక్ డేస్ లో కూడా బాగానే కలెక్ట్ చేస్తుంది!

నార్నె నితిన్(Narne Nithin), సంగీత్ శోభన్(Sangeeth Shobhan), రామ్ నితిన్(Ram Nithin)..లు హీరోలుగా రూపొందిన ‘మ్యాడ్’ (MAD)  సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) రూపొందింది. మొదటి నుండి దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి. టీజర్, ట్రైలర్ ప్రోమోస్ వంటివి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ ను రాబట్టుకున్నాయి. దీంతో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ప్రియాంక జవాల్కర్(Priyanka Jawalkar) , రెబా మోనికా జాన్ (Reba Monica John) కూడా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్స్ చేయడం కూడా అట్రాక్షన్ గా మారింది.

Mad Square Collections

దీంతో మార్చి 28న రిలీజ్ అయిన ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా మంచి వసూళ్లు సాధిస్తుంది. 3 సినిమాల మధ్య భారీ పోటీలో చిన్న సినిమాగా రిలీజ్ అయిన ‘మ్యాడ్ స్క్వేర్’ వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించింది. అలాగే వీక్ డేస్ లో కూడా మంచి వసూళ్లు రాబడుతుంది.ఒకసారి (Mad Square) 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 9.86 cr
సీడెడ్ 2.76 cr
ఉత్తరాంధ్ర 2.67 cr
ఈస్ట్ 1.76 cr
వెస్ట్ 0.84 cr
గుంటూరు 1.53 cr
కృష్ణా 1.19 cr
నెల్లూరు 0.69 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 21.30 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.57 cr
ఓవర్సీస్ 5.17 cr
వరల్డ్ వైడ్ (టోటల్ ) 28.04 కోట్లు(షేర్)

‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) సినిమాకు రూ.20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.21 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.28.04 కోట్లు షేర్ ను రాబట్టింది.

మైల్‌ స్టోన్‌ సినిమా.. కొత్త దర్శకుడితో.. చైతు రిస్క్‌ చేస్తున్నాడా?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus