Madha Gaja Raja Review in Telugu: మదగజరాజ సినిమా రివ్యూ & రేటింగ్!
- January 31, 2025 / 09:43 AM ISTByDheeraj Babu
Cast & Crew
- విశాల్ (Hero)
- అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ (Heroine)
- సంతానం, సోనూ సూద్ తదితరులు.. (Cast)
- సుందర్.సి (Director)
- అక్కినేని మనోహర్ రెడ్డి - అక్కినేని ఆనంద్ ప్రసాద్ - ఏ.సి.షణ్ముగం - ఏ.సి.ఎస్.అరుణ్ కుమార్ (Producer)
- విజయ్ ఆంటోని (Music)
- రిచర్డ్ ఎం.నాథన్ (Cinematography)
- Release Date : తేదీ: జనవరి 31, 2025
- జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ (Banner)
అప్పుడెప్పుడో 2013 సంక్రాంతికి విడుదలవ్వాల్సిన ఒక సినిమా సరిగ్గా 12 ఏళ్ల తర్వాత 2025 సంక్రాంతికి విడుదలవ్వడమే పెద్ద విషయం అనుకుంటే, రిలీజై సూపర్ హిట్ కొట్టడం మరో సెన్సేషన్. అలాంటి అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్న చిత్రం “మదగజరాజ” (Madha Gaja Raja). విశాల్ (Vishal), అంజలి (Anjali), వరలక్ష్మి శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar), సంతానం (N. Santhanam) ప్రధాన పాత్రల్లో సుందర్.సి (Sundar C) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళనాట సూపర్ హిట్ అవ్వడంతో, తెలుగులో అనువాదరూపంలో విడుదల చేసారు. మరి తెలుగు ఆడియన్స్ ను ఈ పాత సీసా ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!
Madha Gaja Raja Review

కథ: జీవితంలో పెద్దగా టెన్షన్స్ ఏమీ లేకుండా.. చాలా సరదాగా లైఫ్ గడిపేస్తుంటాడు రాజు అలియాస్ మదగజరాజు (విశాల్). తన స్నేహితుల జీవితాలను నాశనం చేసిన విశ్వనాథం (సోనూ సూద్)ను (Sonu Sood) ఎదిరించడానికి హైదరాబాద్ వస్తాడు. తనకున్న మీడియా అండతో రాష్ట్ర రాజకీయాలను కంట్రోల్ చేస్తున్న విశ్వనాధంను రాజు ఎలా ఎదిరించాడు? అనేది “మదగజరాజ” (Madha Gaja Raja) కథాంశం.

నటీనటుల పనితీరు: 12 ఏళ్ల క్రితం సినిమా కావడంతో.. విశాల్ & సంతానం మినహా అందరివీ కాస్త ఓవర్ యాక్షన్ లానే కనిపిస్తాయి. ముఖ్యంగా హీరోయిన్లు రొడ్డకొట్టుడు రోల్స్ గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. కేవలం గ్లామర్ పీసులుగా మిగిలిపోయారు. సంతానం కామెడీ పంచులకు మాత్రం థియేటర్లు ఘొల్లుమనడం ఖాయం. ఇక సోనుసూద్, మనోబాల తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: సాంకేతికంగా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి కానీ.. 12 ఏళ్ల క్రితం సినిమా కావడం, ల్యాబులో మరీ ఎక్కువ రోజులు ఉండిపోవడం కారణంగా ఏమీ చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే.. కలరింగ్ విషయంలో చాలా చోట్ల మరీ బ్రైట్ అయిపోయింది. కాకపోతే.. డి.ఐ చేయడానికి ఎక్కువ అవకాశాలు లేకపోవడంతో ఏదో కానిచ్చేశారు.
విజయ్ ఆంటోని బాణీలు బాగున్నా.. సాహిత్యం మాత్రం బాలేదు. లిప్ సింక్ సంగతి దేవుడెరుగు, చాలా చోట్ల శృతి కూడా కొరవడింది. ఆ కారణంగా పాటలు వచ్చినప్పుడల్లా.. అప్పట్లో స్టూడియో ఒన్ లో వచ్చే మలయాళ డబ్బింగ్ సినిమాల క్వాలిటీని గుర్తుచేశాయి.
ఒక ఫక్తు కమర్షియల్ సినిమాకి కావాల్సిన అంశాలన్నీ కలిపి “మదగజరాజ”ను తెరకెక్కించాడు సుందర్.సి. వరలక్ష్మి శరత్ కుమార్ ను కాస్త ఇబ్బందికరంగా ప్రాజెక్ట్ చేశాడే కానీ.. మిగతా అన్ని విషయాల్లో, ముఖ్యంగా తన మార్క్ కామెడీ విషయంలో మాత్రం ఎక్కడా తగ్గలేదు. అందువల్ల.. 12 ఏళ్ల తర్వాత కూడా సంతానం కామెడీ డైలాగులు బాగా పేలాయి.

విశ్లేషణ: సంతానం, హీరోయిన్ల గ్లామర్, విశాల్ స్క్రీన్ ప్రెజన్స్ మినహా సినిమాలో చెప్పుకోదగ్గ అంశాలు ఏమీ లేవు. కానీ.. సంతానం కామెడీ పంచులు మాత్రం హిలేరియస్ గా పేలాయి. అలాగే.. మనోబాల కామెడీ ఎపిసోడ్ కూడా బాగా వర్కవుట్ అయ్యింది. సో, టైమ్ పాస్ కోసం ఈ సినిమాను హ్యాపీగా చూడొచ్చు!

ఫోకస్ పాయింట్: పాత సీసాలో పండిన సంతానం కామెడీ!
రేటింగ్: 2.5/5















