ఆర్.మాధవన్ తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితులే. 2018 సంవత్సరంలో ఆయన నేరుగా తెలుగులోనూ నటించారు. ‘సవ్యసాచి’లో విలన్‌గా నటించి మెప్పించారు. ఇస్ రాత్ కీ సుభా నహీ సినిమాతో నటుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన మాధవన్.. తర్వాత ఇన్‌ఫెర్నో ఇంగ్లీష్ చిత్రంలో నటించాడు. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో సఖీ (అలైపాయుతే) సినిమాతో యువతకు దగ్గరైయ్యారు. ఇటీవల మాధవన్ నటించిన వెబ్ సిరీస్ ‘ది రైల్వే మెన్’ నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి గొప్ప సిరీస్‌లో నటించే అవకాశం రావడం అదృష్టమన్నారు. ‘నా కెరీర్‌లో కొన్ని ప్రాజెక్ట్‌లు నాకెంతో ఆశ్చర్యాన్నిచ్చాయి. నేను ఏ సినిమాలో నటించినా నా పాత్రకు ప్రాణం పోయడానికి వందశాతం ప్రయత్నిస్తాను. అయితే నేను ఇప్పటి వరకు చేసిన కొన్ని సినిమాలు చూసినప్పుడు.. వాటిల్లో నేనేమాత్రం కష్టపడినట్లుగా అనిపించదు.
కానీ, విచిత్రంగా అవి విజయవంతమయ్యాయి. అప్పుడు నాకు (Madhavan) చాలా గందరగోళంగా ఉండేది. ఏది తప్పు.. ఏది కరెక్టో అని తేల్చుకోలేకపోయేవాడిని. అలాంటి విజయానికి నేను అనర్హుడినే అని నాకు అనిపిస్తుంటుంది అని మాధవన్ చెప్పారు. మాధవన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మాధవన్ ప్రస్తుతం అమ్రికీ పండిట్, టెస్ట్, శంకర్ నారాయణ్ నాయర్ బయోపిక్, వష్, జీడీ నాయుడు బయోపిక్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.
ఎవరో ఓరువన్ , సాలా ఖదూస్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇయన ఓం శాంతి ఓం, మిన్నలే, ముంబై మేరీ జాన్, 3 ఇడియెన్స్, తను వెడ్స్ మను: రిటర్న్, మారా, సైలెన్స్ చిత్రాల్లో నటించాడు. రాకెట్రీ చిత్రానికి నిర్మాతగా, స్క్రీన్ రైటర్‌గా, దర్శకత్వం వహించారు.