‘చిరుత’ సినిమాతో హీరోగా డెబ్యూ ఇచ్చాడు చరణ్. ఆ వెంటనే రాజమౌళి దర్శకత్వంలో ‘మగధీర’ చేశాడు. ఇది చరణ్ కు అలాగే రాజమౌళికి ఛాలెంజింగ్ ప్రాజెక్టుగా నిలిచింది. ఎందుకంటే రాజమౌళి కెరీర్ మొదటి హై బడ్జెట్ మూవీ ఇది. అలాగే 2వ సినిమాకే చరణ్ పై అంత బడ్జెట్ పెట్టడం అంటే చిన్న విషయం కాదు. దాదాపు రూ.45 కోట్ల బడ్జెట్ తో అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆ టైంకి టాలీవుడ్లో హైయెస్ట్ బడ్జెట్ తో సినిమాగా నిలిచింది ‘మగధీర’. 2009 వ సంవత్సరం జూలై 31న విడుదలైంది ‘మగధీర’ చిత్రం.
అప్పటి వరకు ఇండస్ట్రీ హిట్ గా చలామణి అవుతున్న ‘పోకిరి’ రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 16 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 22.20 cr |
సీడెడ్ | 13 cr |
ఉత్తరాంధ్ర | 5.90 cr |
ఈస్ట్ | 4.32 cr |
వెస్ట్ | 4.13 cr |
గుంటూరు | 5.18 cr |
కృష్ణా | 3.63 cr |
నెల్లూరు | 3.30 cr |
ఏపీ+తెలంగాణ | 61.66 cr |
తమిళ్ + మలయాళం | 4.50 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 8.30 cr |
ఓవర్సీస్ | 3.50cr |
వరల్డ్ టోటల్ | 77.96 cr (షేర్) |
‘మగధీర’ చిత్రం రూ.40.42 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్లో ఈ చిత్రం ఏకంగా రూ.77.96 కోట్ల షేర్ ను రాబట్టి.. ఇండస్ట్రీ హిట్ చిత్రంగా రికార్డులు సృష్టించింది.మొత్తంగా రూ.37.54 కోట్ల లాభాలు బయ్యర్స్ కు అందించింది ఈ చిత్రం.