అప్పట్లో యాంగ్రీ యంగ్ మ్యాన్ అనే పేరు రాజశేఖర్‌కి రావడానికి, నిలవడానికి కారణమైన సినిమాల్లో ‘మగాడు’ ఒకటి. ఆ సినిమా రాజశేఖర్ (Rajasekhar) వృతిగత జీవితంలో, వ్యక్తిగత జీవితంలో కూడా చాలా కీలకం. ఇప్పుడు ఆ సినిమా గురించి ఎందుకు అనుకుంటున్నారా? ఇక్కడ విషయం ఆ సినిమా గురించి కూడా.. ఆ సినిమా పేరు గురించి. రాజశేఖర్ తన కొత్త సినిమాకు అదే పేరు పెడుతున్నారు అని టాక్. రాజశేఖర్ ఇటీవల ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ (Extra Ordinary Man) అనే సినిమాలో కీలక పాత్ర పోషించారు.
Rajashekar
ఆ తర్వాత ఏ సినిమా కూడా రాలేదు. ఈ క్రమంలో కథలు వింటున్న ఆయన.. పవన్ సాధినేనికి ఓకే చెప్పారు అని సమాచారం. ఆ సినిమాకే ‘మగాడు’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. గత కొన్ని ఏళ్లుగా రాజశేఖర్ చేసిన సినిమాలు ‘గడ్డం గ్యాంగ్’, ‘శేఖర్’ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఇప్పుడు ‘మగాడు’ ఏమన్నా దిశ, దశ మారుస్తుందేమో చూడాలి. ఈ క్రమంలో ‘మగాడు’ సినిమా గురించి చూస్తే.. 1990లో మలయాళం బ్లాక్ బస్టర్ ‘మూన్నం మూర’ అనే సినిమాకు రీమేక్‌గా ‘మగాడు’ తెరకెక్కించారు.
ఆ షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదం వల్ల రాజశేఖర్ గాయపడితే కొంత కాలం బ్రేక్ ఇచ్చి ఆ తర్వాత కొనసాగించారు. ఈ క్రమంలో జీవిత ఆయన బాగా దగ్గరయ్యారు. కట్ చేస్తే సినిమా సూపర్ హిట్ అయ్యింది. రెండే పాటలు, రెగ్యులర్ హీరోయిన్ లేకుండా సాగే ఈ కిడ్నాప్ డ్రామా భారీ వజియం అందుకుంది.
ఈ టైటిల్‌ను ఇటీవల మహేష్ బాబు (Mahesh Babu) సినిమాకు పెడతారు అని ఓ టాక్ నడిచింది. ‘శ్రీమంతుడు’ (Srimanthudu) సినిమాకు తొలుత ఈ టైటిలే అనుకున్నారు. ఆ మేరకు వార్తుల కూడా వచ్చాయి. కానీ ఏమైందో ఏమో తర్వాత పేరు మార్చేశారు. ఆ తర్వాత ఎవరూ ఆ పేరు టచ్ చేయలేదు. ఇప్పుడు ఇన్నాళ్లకు అంటే 34 ఏళ్ల తర్వాత రాజశేఖరే (Rajashekar) ఎంచుకుంటున్నారు.