Maha Samudram Movie: శర్వానంద్ ఆశలు ఈ సినిమాతో నెరవేరతాయా?

శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా అజయ్ భూపతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మహాసముద్రం సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని శర్వానంద్ ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంటాడని అతని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్, అదితీరావు హైదరీ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 14వ తేదీన దసరా కానుకగా ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఈ సినిమా డిజిటల్ హక్కులు నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్టు సమాచారం. నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా హక్కులను ఏకంగా 11 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మల్టీస్టారర్ సినిమా కావడంతో నెట్ ఫ్లిక్స్ మహాసముద్రం సినిమాకు భారీ ఆఫర్ ఇచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్, పాటలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. అయితే మహాసముద్రం సినిమాకు రెండు సినిమాల నుంచి పోటీ ఎదురవుతోంది.

దసరా కానుకగా వరుడు కావలెను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమలు కూడా రిలీజ్ కానున్నాయి. మహాసముద్రం సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని భావిస్తున్న శర్వానంద్ ఆశలు తీరతాయో లేదో చూడాల్సి ఉంది. దసరాకు రిలీజయ్యే మూడు సినిమాలలో ఏ సినిమా పై చేయి సాధిస్తుందో చూడాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ డేట్ మారడంతో దసరాను టార్గెట్ చేసుకుని ఈ సినిమాలు రిలీజ్ కానుండగా ముగ్గురు మిడిల్ రేంజ్ హీరోలు పోటీ పడుతుండటం గమనార్హం.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus