సినీ పరిశ్రమలో మరో విషాదం.. మహాభారతం నటుడు గుఫీ పైంతాల్ ఇకలేరు!

ప్రముఖ బాలీవుడ్ నటుడు మహాభారతం టీవీ సీరియల్ లో శకుని పాత్రలో నటించిన నటుడు గుఫీ పైంతాల్ తుది శ్వాస విడిచారు. వయసు పై పడటంతో గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ఈయన ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటూ ఉండేవారు.అయితే కొంత ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినప్పటికీ తాజాగా ఈయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆఖరి శ్వాస వదిలారనీ తెలుస్తుంది. మే 31వ తేదీ ఈయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు తనని ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు.

అయితే ఈయన పరిస్థితి విషమంగా మారడంతో మరణించారని తెలుస్తుంది. అయితే ఈయనకు గుండెపోటు రావడంతో మరణించారని వైద్యులు వెల్లడించారు. నటుడు గుఫీ పైంతాల్ మరణించారన్న వార్త తెలియడంతో ఎంతోమంది విచారం వ్యక్తం చేశారు. ఇక ఈయన మరణ వార్తను తన కుటుంబ సభ్యుల సోషల్ మీడియా వేదికగా తెలియచేస్తూ మా తండ్రి మిస్టర్ గూఫీ పెంటల్ (శకుని మామ) మరణించారని ఈ సంగతిని విచారంతో తెలియజేస్తున్నామని కుటుంబ సభ్యులు చెప్పారు.

ఇక ఈయన (Gufi Paintal) కేవలం బుల్లితెర కార్యక్రమాలు మాత్రమే కాకుండా కొన్ని టీవీ షోలు, శ్రీ చైతన్య మహాప్రభు అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. అతను BR ఫిల్మ్స్‌లో అసోసియేట్ డైరెక్టర్, కాస్టింగ్ డైరెక్టర్ , ప్రొడక్షన్ డిజైనర్‌గా కూడా పనిచేశారు. ఇలా సీరియల్ నటుడిగా, దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈయన మరణ వార్త ఎంతో బాధాకరమని చెప్పాలి.

ముఖ్యంగా మహాభారతం సీరియల్ లో ఈయన శకుని పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారని చెప్పాలి. ఈయన మరణ వార్త తెలియడంతో శకుని మామ ఇక లేరు అంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus