శర్వానంద్ (Sharwanand), మెహ్రీన్ పీర్జాదా (Mehreen Pirzada) జంటగా నటించిన ‘మహానుభావుడు’ (Mahanubhavudu) చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్ పై వి.వంశీ కృష్ణారెడ్డి (V. Vamshi Krishna Reddy), ప్రమోద్ లు (Pramod Uppalapati) నిర్మించారు. తమన్ (S.S.Thaman) సంగీత దర్శకుడు. 2017 సెప్టెంబర్ 29న ఈ సినిమా రిలీజ్ అయ్యింది.పోటీగా మహేష్ బాబు (Mahesh Babu) – మురుగదాస్ (A.R. Murugadoss) ల ‘స్పైడర్’ (Spyder), ఎన్టీఆర్ (Jr NTR) ‘జై లవ కుశ’ (Jai Lava Kusa) చిత్రాలు ఉన్నప్పటికీ పాజిటివ్ టాక్ సంపాదించుకుని బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని అందుకుంది.
నేటితో ఈ చిత్రం రిలీజ్ అయ్యి 7 ఏళ్ళు పూర్తి కావస్తోంది. మరి ఫుల్ రన్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 6.01 cr |
సీడెడ్ | 2.56 cr |
ఉత్తరాంధ్ర | 2.81 cr |
ఈస్ట్ | 1.70 cr |
వెస్ట్ | 1.10 cr |
గుంటూరు | 1.88 cr |
కృష్ణా | 1.63 cr |
నెల్లూరు | 0.59 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 18.28 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 2.60 Cr |
ఓవర్సీస్ | 2.10 Cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 22.98 cr |
‘మహానుభావుడు’ చిత్రం రూ.21.7 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్లో రూ.22.98 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్లకు రూ.1.28 కోట్ల లాభాలు అందించి క్లీన్ హిట్ గా నిలిచింది ‘మహానుభావుడు’. 2017లో ‘శతమానం భవతి’ వంటి బ్లాక్ బస్టర్ తో పాటు ‘మహానుభావుడు’ కూడా శర్వానంద్ కి క్లీన్ హిట్ ఇచ్చింది. అయితే తర్వాత శర్వానంద్ నటించిన ఏ సినిమా కూడా.. ‘మహానుభావుడు’ రేంజ్లో కలెక్ట్ చేయలేదు.