Maharaja: ‘మహారాజ’ (తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

  • June 14, 2024 / 11:12 PM IST

విజయ్ సేతుపతికి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. అయితే అది హీరోగా కాదు. ‘మాస్టర్’ ‘ఉప్పెన’ ‘విక్రమ్’ వంటి సినిమాల్లో విజయ్ సేతుపతి నటనని తెలుగు ప్రేక్షకులు అమితంగా ఇష్టపడ్డారు. ‘సైరా నరసింహారెడ్డి’ ‘ఉప్పెన’ వంటి స్ట్రైట్ తెలుగు సినిమాల్లో కూడా అతను కీలక పాత్రలు చేసిన సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి హీరోగా చేసిన సినిమాల్లో ‘పిజ్జా’ తప్ప ఏదీ కూడా తెలుగులో అంతగా ఆదరణ పొందలేదు. అయినా సరే తన 50వ సినిమా ‘మహారాజ’ ని జూన్ 14న తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా తీసుకురాబోతున్నాడు.

నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘ప్యాషన్ స్టూడియోస్’, ‘ది రూట్’ సంస్థలపై సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి ..లు నిర్మించారు. అనురాగ్ కశ్యప్ ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించడం విశేషం. తెలుగులో ఈ చిత్రాన్ని ‘మైత్రి’ సంస్థ పై శశి రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ సినిమా తెలుగు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో ఒక లుక్కేద్దాం రండి :

నైజాం 0.70 cr
సీడెడ్ 0.30 cr
ఉత్తరాంధ్ర 0.50 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 1.50 cr

‘మహారాజ’ చిత్రానికి తెలుగులో రూ.1.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.1.8 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మరి ఆ టార్గెట్ ను రీచ్ అవుతుందో లేదో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus