మహేష్ బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో వచ్చిన ‘మహర్షి’ తాజాగా విడుదలై డీసెంట్ టాక్ ను సొంతం చేసుకుంది. మహేష్ 25 చిత్రంగా వచ్చిన ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ ను సాధించిందని. ‘భరత్ అనే నేను’ అంత బ్లాక్ బస్టర్ టాక్ రానప్పటికీ ఈ చిత్రం మొదటి నాలుగు రోజులకి మంచి కలెక్షన్స్ వచ్చాయి. అయితే ఒక్క నైజాం, గుంటూరు తప్ప మరే ఏరియాల్లోనూ ఈ చిత్రం ఆశించిన కలెక్షన్లను రాబట్టడం లేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో మొదటి 4 రోజులకి ఈ చిత్రం వరల్డ్ వైడ్ 63.43 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.
ఇక ఫస్ట్ వీకెండ్ కు గానూ ‘మహర్షి’ ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం – 16.61 కోట్లు
సీడెడ్ – 5.60 కోట్లు
వైజాగ్ – 5.55 కోట్లు
ఈస్ట్ – 4.86 కోట్లు
వెస్ట్ – 3.73 కోట్లు
కృష్ణా – 3.62 కోట్లు
గుంటూరు – 5.90 కోట్లు
నెల్లూరు – 1.71 కోట్లు
———————————————
ఏపీ + తెలంగాణా – 47.58 కోట్లు
(టోటల్)
రెస్ట్ అఫ్ ఇండియా – 7.85 కోట్లు
ఓవర్సీస్ – 8.0 కోట్లు
———————————————
వరల్డ్ వైడ్ టోటల్ – 63.43 కోట్లు
———————————————
‘మహర్షి’ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా 95 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నాలుగు రోజులకి గానూ వరల్డ్ వైడ్ 63.43 కోట్ల షేర్ వచ్చింది. అంతే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 33 కోట్లు రాబట్టాల్సి ఉంది. ఈ చిత్రానికి వచ్చిన టాక్ తో అది సాధ్యం అవుతుందా అంటే కష్టమనే చెప్పాలి. వీకెండ్ ను బాగానే క్యాష్ చేసుకుంది. అలా అని రికార్డులు ఏమీ కొట్టలేదు. మహేష్ కు పిచ్చ క్రేజ్ ఉన్న ఓవర్సీస్లో ఈ చిత్రం పరిస్థితి ఏమాత్రం బాలేదు. అక్కడ కనీకష్టంగా 1 మిలియన్ దాటింది. అక్కడ బయ్యర్స్ సేఫ్ అవ్వాలంటే 2.5 మిలియన్ రాబట్టాల్సి ఉంది. కానీ అది అసాధ్యమని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. సమ్మర్ హాలిడేస్ ఉన్నా.. దిల్ రాజు లాంటి బడా ప్రొడ్యూసర్ ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసినా… ఈ చిత్రానికి రికార్డులు ఏమీ రావడంలేదు. ఇక ఈ చిత్రానికి అసలు పరీక్ష ఈరోజు నుండీ మొదలు కానుంది. వీక్ డేస్ లో ఈ చిత్రం మంచి కలెక్షన్లు రాబట్టలేకపోతే బ్రేక్ ఈవెన్ అవ్వడం కూడా చాలా కష్టం. మరి మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.