‘మహావతార్ నరసింహ’ చిత్రం జూలై 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ వంటి పెద్ద సినిమా ఉండటంతో జనాలు దీనిని పట్టించుకోలేదు. అయినప్పటికీ లిమిటెడ్ స్క్రీన్స్, తక్కువ టికెట్ రేట్లతో కూడా మంచి కలెక్షన్స్ సాధించింది. 2వ వీకెండ్ ‘కింగ్డమ్’ సినిమా వచ్చినప్పటికీ ఈ సినిమా హవా ఏమాత్రం తగ్గలేదు. 2వ వారంలో కూడా మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది.
3వ వీకెండ్ లో కూడా దుమ్ము లేపింది. కనీవినీ ఎరుగని రేంజ్లో మాస్ బుకింగ్స్ ను సాధించింది. చూస్తుంటే 3వ కూడా అదీ వీక్ డేస్ లో కూడా తగ్గేలా కనిపించడం లేదు. అయితే వార్ 2, కూలీ వంటి పెద్ద సినిమాలు వస్తున్నాయి కాబట్టి.. చూడాలి మరి ఏమవుతుందో.ఒకసారి 18 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
ఏపీ+తెలంగాణ | 19.80 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా+హిందీ | 98.5 cr |
ఓవర్సీస్ | 6.21 cr |
వరల్డ్ టోటల్ | 124.51 cr (షేర్) |
‘మహావతార్ నరసింహ’ ప్రపంచ వ్యాప్తంగా రూ.15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. 18 రోజుల్లో ఏకంగా వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.124.51 కోట్ల షేర్ ను రాబట్టింది. రూ.109.51 కోట్ల లాభాలతో అంటే.. ఆల్మోస్ట్ 7 రెట్లు పైగా లాభాలు అందించింది అని చెప్పాలి. ఇంకా స్ట్రాంగ్ గా రన్ అవుతుంది.