కంటెంట్ ఉన్న సినిమాకి ఆడియన్స్ అన్యాయం చేయరు అనేది ‘మహావతార్ నరసింహ’ సినిమాతో ప్రూవ్ అయ్యింది.పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ పక్కన పెద్దగా హడావిడి లేకుండా జూలై 25న రిలీజ్ అయ్యింది ఈ సినిమా. తక్కువ టికెట్ రేట్లు, తక్కువ థియేటర్లే దక్కాయి. అయినా సరే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో.. ఆ నెగిటివ్స్ ఏమీ సినిమాని అడ్డుకోలేకపోయాయి. దర్శకుడు అశ్విన్ కుమార్ మహావిష్ణువు 9 అవతారాలను యానిమేటెడ్ వెర్షన్ సినిమాలుగా రూపొందిస్తున్నట్టు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
అందులో మొదటి చిత్రంగా ‘మహావతార్ నరసింహ’ తెరకెక్కింది. హిరణ్యకశిపుడు,మహావిష్ణువు,ప్రహ్లాదుడు వంటి వారి గురించి క్లుప్తంగా వివరిస్తూ మంచి చెడుని సూచిస్తూ విజువల్ వండర్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు.సినిమా రిలీజ్ అయ్యి 9 రోజులు అయినా కలెక్షన్స్ మాత్రం తగ్గడం లేదు అనే చెప్పాలి :
ఏపీ+తెలంగాణ | 9.02 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా+హిందీ | 32.5 cr |
ఓవర్సీస్ | 2.20 cr |
వరల్డ్ టోటల్ | 43.72 cr (షేర్) |
‘మహావతార్ నరసింహ’ ప్రపంచ వ్యాప్తంగా రూ.15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. 9 రోజుల్లో ఏకంగా వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.43.72 కోట్ల షేర్ ను రాబట్టింది. రూ.28.72 కోట్ల లాభాలు అంటే.. ఆల్రెడీ ట్రిపుల్ ప్రాఫిట్స్ అనమాట. హిందీలో ఈ సినిమా రూ.50 కోట్ల గ్రాస్ మార్క్ ను దాటేసింది. ఆది వారం రోజు కూడా అక్కడ భారీ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది.