పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన చారిత్రాత్మక చిత్రం ‘హరిహర వీరమల్లు’. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.జూలై 23 నే ప్రీమియర్స్ వేశారు. వాటి వల్ల సినిమాకి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ సూపర్ ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి రోజు కలెక్షన్స్ పర్వాలేదు అనిపించినా 2వ రోజు నుండి డౌన్ అయ్యాయి. అయినప్పటికీ వీకెండ్ వరకు ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించాయి అనే చెప్పాలి. కానీ వీక్ డేస్ లో పడిపోయాయి.
2వ వీకెండ్ కి స్క్రీన్స్ తగ్గాయి. లిమిటెడ్ స్క్రీన్స్ కొంత ఆక్యుపెన్సీలు నమోదు చేస్తుంది ఈ చిత్రం. ఒకసారి 10 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 16.87 cr |
సీడెడ్ | 7.97 cr |
ఉత్తరాంధ్ర | 6.77 cr |
ఈస్ట్ | 4.81 cr |
వెస్ట్ | 4.02 cr |
గుంటూరు | 4.60 cr |
కృష్ణా | 4.22 cr |
నెల్లూరు | 1.78 cr |
ఏపీ+తెలంగాణ | 51.04 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 4.89 cr |
ఓవర్సీస్ | 6.43 cr |
వరల్డ్ టోటల్ | 62.36 cr (షేర్) |
‘హరిహర వీరమల్లు’ చిత్రానికి రూ.120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.121 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 10 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.62.36 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.102.22 కోట్లు కొల్లగొట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.58.95 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.