Mahaveerudu: మహావీరుడు తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్!

శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మహావీరుడు. జూలై 14 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్, ట్రైలర్ వంటి ప్రమోషనల్ కంటెంట్ బాగుంది. డిఫరెంట్ గా కూడా ఉందని చెప్పాలి. మండేలా ఫేమ్ మడోన్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. అదితి శంకర్‌ హీరోయిన్ గా నటిస్తుంది. ‘శాంతి టాకీస్‌’ పతాకంపై అరుణ్‌ విశ్వ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

టాలీవుడ్ లీడింగ్ బ్యానర్స్ లో ఒకటైన ‘ఏషియన్ సినిమాస్’ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తుంది. దీంతో ఈ చిత్రానికి తెలుగులో థియేట్రికల్ బిజినెస్ జరిగిందని చెప్పాలి. వాటి వివరాలు గమనిస్తే :

నైజాం 1.80 cr
సీడెడ్ 1.00 cr
ఆంధ్ర 2.00 cr
ఏపి + తెలంగాణా 4.80 cr

‘మహావీరుడు’ (Mahaveerudu) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.4.8 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది.శివ కార్తికేయన్ కి తెలుగులో ఇంత బిజినెస్ జరగడం ఇదే మొదటిసారి. ఈ మూవీ బ్రేక్ ఎవెన్ కావాలంటే రూ.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. హిట్ టాక్ వచ్చి.. ఓపెనింగ్స్ బాగా నమోదైతే తప్ప బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉండవు. మరి ఈ మూవీ ఎంత వరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి. ఒకవేళ ఈ మూవీ కనుక బ్రేక్ ఈవెన్ సాధిస్తే శివ కార్తికేయన్ మార్కెట్ స్ట్రాంగ్ అయినట్టే అని చెప్పాలి.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus