సూపర్ స్టార్ మూవీ శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్న జీ తెలుగు

సూపర్ స్టార్ మహేష్ బాబు గత చిత్రం బ్రహ్మోత్సవం నిరాశపరిచినప్పటికీ  క్రేజ్ పెరిగిందే తప్ప తగ్గలేదు. ప్రస్తుతం కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో ప్రిన్స్ నటిస్తున్న చిత్రం శాటిలైట్ హక్కులు హాట్ కేక్ లా అమ్ముడుపోయింది. 100 కోట్ల బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీ  తెలుగు వెర్షన్ కి 16 కోట్లు చెల్లించి జీ తెలుగు వారు సొంతం చేసుకున్నారు. బ్రహ్మోత్సవం మూవీ హక్కులను కూడా జీ తెలుగువారే 11 కోట్లకు దక్కించుకున్నారు.

ఇప్పుడు మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న మూవీకి మరో 5 కోట్లు అదనంగా చెల్లించడం విశేషం. దీంతో తమిళ వెర్షన్ ఎంత ధర పలుకుతుందో నని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సూపర్ స్టార్ ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ దీపావళికి  రిలీజ్ చేయనున్నారు. జాతీయ అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ పనిచేస్తున్న ఈ చిత్రానికి హరీష్ జయరాజ్ సంగీతమందిస్తున్నారు. ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు, నమ్రత సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీని వేసవిలో విడుదల చేయాలనీ భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus