త్రివిక్రమ్ కోసం మురుగదాస్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన మహేష్
- March 16, 2017 / 07:59 AM ISTByFilmy Focus
తమిళ డైరక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న ద్విభాషా చిత్రం వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ షూటింగ్ కి మహేష్ బ్రేక్ ఇచ్చినట్లు తెలిసింది. ఎందుకని ఆరా తీయగా ఆసక్తికరమైన విషయం బయటపడింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కోసం షూటింగ్ కి విరామం ఇచ్చినట్లు సమాచారం. వీరి ఇద్దరి కాంబినేషన్లో సినిమా మొదలు కాబోతుందా? అని ఆలోచనలోకి వెళ్ళకండి. మహేష్ తో ఓ యాడ్ ఫిలిం ని త్రివిక్రమ్ షూట్ చేయనున్నారు. ఇందుకోసం సూపర్ స్టార్ రెండు రోజుల డేట్స్ కేటాయించారు.
ఇది వరకు త్రివిక్రమ్ డైరక్ట్ చేసిన అభి బస్, థమ్స్ అప్, జో అలుకాస్ తదితర ప్రకటన చిత్రాలు బాగా పాపులర్ అయ్యాయి. సో ఇప్పుడు చేయనున్న వాణిజ్య ప్రకటన కూడా ఆకట్టుకోవడం గ్యారంటీ. మహేష్ 23 వ మూవీ ఫస్ట్ లుక్ ఉగాది కానుకగా రిలీజ్ కానుంది. అప్పుడే టైటిల్ కూడా రివీల్ కానుంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయిన వెంటనే మహేష్ బాబు కొరటాల దర్శకత్వంలో సినిమా చేయనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















