సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్కో సినిమాకు ప్రస్తుతం 50 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారు. మహేష్ నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే ఆయన పారితోషికం కూడా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. సినిమాల ద్వారా సంపాదించిన మొత్తాన్ని మహేష్ తెలివిగా ఇన్వెస్ట్ చేస్తుండటం గమనార్హం. గచ్చిబౌలిలో ఏషియన్ మూవీస్ అధినేతలతో కలిసి మహేష్ నిర్మించిన ఏఎంబీ సినిమాస్ లో సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. ఏఎంబీ మల్టీప్లెక్స్ లో రికార్డు స్థాయిలో ప్రీమియర్ షోలు వేస్తుండటంతో పాటు ఏఎంబీ మల్టీప్లెక్స్ కలెక్షన్లపరంగా అరుదైన రికార్డులను సొంతం చేసుకుంటోంది.
అయితే ఏఎంబీ సినిమాస్ కొత్త వెంచర్లకు గతంలోనే ప్రకటన వెలువడగా నానక్ రామ్ గూడలోని ఫినాన్షియల్ డిస్ట్రిక్ ఏరియాలో ఏఎంబీ సినిమాస్ సెకండ్ వెంచర్ రానుందని సమాచారం. గచ్చిబౌలిలో ఉన్న ఫస్ట్ వెంచర్ ను మించి మరింత లావిష్ గా సెకండ్ వెంచర్ ఉండబోతుందని తెలుస్తోంది. ఫస్ట్ వెంచర్ తో పోలిస్తే ఇందులో స్క్రీన్ల సంఖ్య కూడా ఎక్కువని సమాచారం. ఈ సెకండ్ వెంచర్ కు ఏఎంబీ సూపర్ ప్లెక్స్ అనే పేరు పెట్టనున్నారని తెలుస్తోంది.
కరోనా ప్రభావం తగ్గిన తర్వాత ఏఎంబీ సినిమాస్ కొత్త వెంచర్లకు సంబంధించిన ప్రకటనలు రానున్నాయి. ఏఎంబీ సినిమాస్ విషయంలో మహేష్ బాబు ప్లానింగ్ మామూలుగా లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో నటిస్తుండగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది.