సూపర్ స్టార్ కృష్ణ.. మరణవార్తతో అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా విషాదానికి లోనయ్యారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత కృష్ణ పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఒకే ఏడాదిలో ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోయిన మహేష్ బాబు కుటుంబం సైతం తీవ్ర మనోవేదనకు గురవుతుంది. గుండెపోటు, ఆర్గాన్ డ్యామేజ్ వంటి సమస్యల కారణంగా కృష్ణ మరణించినట్లు తెలుస్తుంది. అయితే ఎక్మో విధానాన్ని వాడి ఉంటే కృష్ణ గారిని కాపాడునే అవకాశం ఉందట.
కానీ ఆయన కుటుంబం ఆ నిర్ణయం తీసుకోలేదు.ఎందుకు తీసుకోలేదు? అంత కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అనే డౌట్ అందరికీ రావచ్చు. నిజానికి కృష్ణ ఫ్యామిలీ గొప్ప నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే.. ? ECMO అంటే ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజెనేషన్ అంటారు.ఈ విధానం ద్వారానే కృష్ణను కాపాడుకునే అవకాశం ఉంది. కానీ ఇది అంత తేలికైనది కాదు. దీనిని చేసే క్రమంలో చాలా ఇబ్బందులు వస్తాయి. అలాగే ఈ విధానానికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి.
ఈ విధానాన్ని అమలు చేయాలి అంటే మనిషి ముందు కాస్త శారీరకంగా దృఢంగా ఉండాలి కానీ కృష్ణగారు అంత బలంగా లేరు. అంతేకాదు ఈ విధానాన్ని ఫాలో అయ్యే టైంలో.. రక్తం గడ్డకట్టకుండా మెషిన్‌లోకి వెళ్లడానికి ట్యాబ్లెట్స్ ఇస్తారు. వాటి వల్ల బ్లీడింగ్ జరిగే అవకాశం ఉంటుందట . అలాగే ట్యూబ్స్ పెట్టే చోట ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంటుందట. రక్తం గడ్డ కట్టడం, ట్యూబ్లలో గాలి చేరడం జరుగుతుంది. అలాగే ఈ క్రమంలో కృష్ణ గారికి మళ్లీ హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది.
ఇవన్నీ తట్టుకుని కృష్ణ గారి శరీరం సహకరించినా ప్రాణం నిలబడినా సాధారణ స్థితికి వచ్చే అవకాశం అయితే ఉండదు.ఇదే విషయాన్ని వైద్యులు కృష్ణ కుటుంబంతో చెప్పడం జరిగింది. ఇద్దరు భార్యలను ,కొడుకుని కోల్పోయి మానసికంగా కుంగిపోయిన కృష్ణ గారు ఈ ఎక్మో ట్రీట్మెంట్‌ని చేయించుకునే స్థితిలో లేరు. అందుకే పోయే ముందు కూడా ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక కృష్ణ కుటుంబ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.