“భరత్ అనే నేను” సినిమా థియేటర్ రైట్స్ కోసం పోటీ ..!

కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న “భరత్ అనే నేను” (Bharat Ane Nenu)సినిమా ఫస్ట్ ఓత్ జనవరి 26 న రిలీజ్ అయి విశేషంగా ఆకట్టుకుంది. నేటి ముఖ్యమంత్రిగా మహేష్ ప్రమాణంతో అదరగొట్టారు. నిన్న “భరత్ విజన్” పేరిట టీజర్ రిలీజ్ అయింది. ఈ వీడియో సినిమాపై అంచనాలను పెంచింది. దీంతో ఈ సినిమా థియేటర్ రైట్స్ కోసం పోటీ ఏర్పడింది. “భ‌ర‌త్‌ అనే నేను” ఉత్త‌రాంధ్ర థియేటర్స్ హ‌క్కుల కోసం 38 కోట్లు ఇవ్వడానికి ఒకరు ముందుకొచ్చినట్టు సమాచారం. అందుకు నిర్మాత డీవీవీ దానయ్య చాలా సంతోషపడ్డారు. ఇవ్వడానికి సిద్ధపడ్డారు. కానీ దర్శకుడు కొరటాల అడ్డుకున్నారని సమాచారం. ఎందుకంటే తన సినిమాపై ఉన్న నమ్మకం.

అంతేకాదు ఫస్ట్ లుక్, టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ తన నమ్మకానికి మరింతబలాన్ని ఇచ్చింది. అందుకే 40 కోట్ల‌కు అయితే ఇవ్వమని కొరటాల నిర్మాతకు స్పష్టంగా చెప్పారంట. అంతేకాదు ఉత్త‌రాంధ్ర హ‌క్కుల్ని కొనాల్సిందిగా త‌న స్నేహితుడైన ఫేమ‌స్ డిస్ట్రిబ్యూట‌ర్ సుధాక‌ర్‌కి కూడా కొరటాల సలహా ఇచ్చారంట. దీనిని బట్టి సినిమా బాగా వచ్చిందనే విషయం స్పష్టమవుతోంది. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రానికి డైరక్టర్ రెమ్యునరేషన్ తో పాటు షేర్ కూడా అందుకోనున్నారు. అందుకోసమే బిజినెస్ లోను కొరటాల వేలు పెడుతున్నారని ఫిలింనగర్ వాసులు చెప్పుకుంటున్నారు. మరి అందరూ ఎదురుచూస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 20 న థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus