తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కువగా వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్న హీరో మహేష్ బాబు. థమ్స్ అప్, అభి బస్, సంతూర్ సోప్, పారగాన్ తదితర అనేక కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. రెండేళ్లుగా అతనికి ఒక హిట్ లేక పోయినా క్రేజ్ మాత్రం తగ్గిపోలేదు. బ్రహ్మోత్సవం, స్పైడర్ నిరాశపరిచినప్పటికీ.. సినిమా అవకాశాల్లో మార్పు లేనట్టే.. బ్రాండింగ్ లోను క్రేజ్ తగ్గలేదు. తాజాగా మహేష్ చేతిలోకి మరో కంపెనీ చేరింది. ప్రోటినేక్స్ అనే ప్రోటీన్ బ్రాండ్ కి అంబాసడర్ గా సైన్ చేశారు. “ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్ లో మనం ఆక్టివ్ గా ఉండాలంటే ప్రోటీన్ అవసరం చాలా ఉంది. అందుకే నేను నా డైలీ డైట్ లో సరిపడా ప్రోటీన్ ఉండేలా చూసుకుంటాను.
దానికోసం ప్రోటినేక్స్ నాకు దోహద పడుతుంది” అంటూ మహేష్ చెప్పే ప్రకటన కూడా సిద్ధమైంది. త్వరలోనే టీవీ ఛానల్స్ లో ప్రసారం కానుంది. బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్న ఉత్పత్తుల కంపెనీల నుంచి తనకు వచ్చే వార్షిక ఆదాయంలో 30 శాతం ఛారిటీలకు అందించే విధంగా మహేష్ చర్యలు తీసుకున్నారు. ఈ కొత్త కంపెనీ వల్ల వచ్చే ఆదాయంలోనూ 30 శాతం సేవ కార్యక్రమాలకు వెళ్ళిపోనుంది. ఇక సినిమా విషయానికి వస్తే.. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న భరత్ అనే నేను షూటింగ్ చివరి దశకు చేరుకుంది. భారీ అంచనాలున్న ఈ సినిమా ఏప్రిల్ 20 న రిలీజ్ కానుంది.