తండ్రి అడుగుజాడల్లో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్నాడు మహేష్‌బాబు. తండ్రిని మించిన పాత్రలు చేయడం, డేరింగ్ చేయడం లాంటివి చేస్తాడా లేదా అనేది పక్కపెడితే.. తండ్రి బయోపిక్ ఎప్పుడు తీస్తాడు అనే ప్రశ్న చాలారోజులుగా ప్రేక్షకుల మదిలో ఉంది. ఆ మధ్య ఎప్పుడో అడిగితే అలాంటి ఆలోచనలు లేవని చెప్పాడు మహేష్. ఇప్పుడు మరోసారి అలాంటి సమాధానమే చెప్పి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. టాలీవుడ్ సీనియర్ నటుల్లో బయోపిక్‌కి అనువైన అన్ని అంశాలు ఉన్న జీవితం సూపర్ స్టార్ కృష్ణది.
కెరీర్‌లో ఎత్తు పల్లాలు కానీ, ఆయన చేసిన ధైర్యం కానీ, నటనలో వైవిధ్యం కానీ ఎవరూ చేయలేదు అని చెప్పొచ్చు. అందుకే ఆయన ఎవర్ గ్రీన్ సూపర్‌స్టార్. అలాంటి వ్యక్తి బయోపిక్ నేటితరం కుర్రాళ్లకు చూపించడం చాలా అవసరం. అందులో మహేష్‌బాబు నటిస్తే చూడాలనేది సగటు ఘట్టమనేని అభిమాని కోరిక. కానీ మహేష్ తిరస్కరిస్తున్నాడు. దానికి కారణం కూడా చెప్పారు మహేష్. తన తండ్రి తనకు దేవుడని, అలాంటి వ్యక్తి బయోపిక్‌లో నటించడం లాంటి పని చేయను అని చెప్పాడు.
అంతేకాదు ఎవరైనా ఆయన బయోపిక్ తీస్తే చూసి ఎంజాయ్ చేస్తానని కూడా చెప్పాడు మహేష్. అంతే కాదు ఆ సినిమాను నిర్మించడానికి కూడా ముందుకొస్తానని చెప్పాడు మహేష్. ఎన్టీఆర్ బయోపిక్‌ను ఆయన తనయుల్లో ఒకరు నటించి, సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. అక్కినేని బయోపిక్ గురించి నాగార్జున పెద్ద ఆసక్తిని కనబరచరడం లేదు. తన తండ్రి జీవితంలో బయోపిక్‌కు అవసరమైనంత ఎత్తుపల్లాలు లేవని ఇప్పటికే స్పష్టం చేశారు నాగార్జున. మరి కృష్ణ బయోపిక్ రూపకల్పన జరుగుతుందో లేదో చూడాలి.
డబ్బులు పెట్టడానికి నిర్మాతగా మహేష్ రెడీ, ఎవరైనా ఆ ప్రయత్నం చేస్తారేమో చూడాలి. ఇక బాలీవుడ్ సినిమా విషయంలోనూ మహేష్ పాత పాటే పాడాడు. తనకు బాలీవుడ్ కంటే టాలీవుడ్‌లో రాణించడమే ముఖ్యమని, బాలీవుడ్ తనకు సరిపడదు అని క్లారిటీ ఇచ్చేశాడు మహేష్. అయితే మరిప్పుడు రాజమౌళితో చేసే సినిమా హిందీకి వెళ్తుంది. అంటే నేరుగా సినిమా చేయడు కానీ, పాన్ ఇండియాగా వెళ్తే ఓకే అన్నమాట.
Most Recommended Video
అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!