Mahesh Babu: ఆ థియేటర్లో సర్కారు స్పెషల్ షో వేస్తున్నారా?

సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ కెరీర్ లో మురారి, ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు లాంటి విజయాలు ఉన్నాయి. ఈ సినిమాలు నిర్మాతలకు భారీ లాభాలను అందించాయి. మహేష్ సర్కారు వారి పాట అనే సినిమాలో నటించగా చెన్నైలో ఈ సినిమాకు రికార్డు స్థాయిలో ప్రీమియర్స్ పడనున్నాయని సమాచారం అందుతోంది. చెన్నైలోని రోహిణి సిల్వర్ స్క్రీన్ థియేటర్ ఎంతో ఫేమస్ అనే సంగతి తెలిసిందే.

సాధారణంగా కోలీవుడ్ పెద్ద హీరోల సినిమాలకు మాత్రమే ఈ థియేటర్ లో ఉదయం సమయంలో స్పెషల్ షోలను ప్రదర్శించడం జరుగుతుంది. అయితే సర్కారు వారి పాట తెలుగు వెర్షన్ ఈ థియేటర్ లో బెనిఫిట్ షో ప్రదర్శితం కానుందని సమాచారం అందుతోంది. తెలుగు వెర్షన్ విషయంలో ఈ రికార్డును సొంతం చేసుకున్న తొలి తెలుగు సినిమా సర్కారు వారి పాట అని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలలో ఏ స్థాయిలో ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారో తమిళంలో కూడా ఈ సినిమాను అదే స్థాయిలో ప్రదర్శించనున్నారని బోగట్టా.

చెన్నైలోని మహేష్ బాబు అభిమానులకు ఇది నిజంగా శుభవార్త అనే చెప్పాలి. రోహిణి థియేటర్ 30 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న థియేటర్ కావడం గమనార్హం. నిర్మాతలు సైతం ఈ సినిమా ఫలితం విషయంలో ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ కు ఢోకా ఉండదని సమాచారం అందుతోంది. సర్కారు వారి పాటకు పాజిటివ్ టాక్ వస్తే పరశురామ్ కు కూడా స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు దక్కనుంది.

గీతా గోవిందం సక్సెస్ వల్ల పరశురామ్ కు ఈ సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ దక్కింది. కొత్త తరహా కథనంతో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. సర్కారు వారి పాట కరోనాను దాటుకుని ఎట్టకేలకు థియేటర్లలో రిలీజ్ కానుంది. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా సకాలంలో షూటింగ్ ను పూర్తి చేసుకోకపోవడంతో మే నెల 12వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుండటం గమనార్హం.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus