“సప్త సముద్రాలు ఈది ఇంటి ముందు కాలువలో పడి సచ్చాడట” అనే సామెత దేవిశ్రీప్రసాద్ విషయంలో నిజమైంది. సంగీత దర్శకుడిగా కెరీర్ ఫామ్ లోకి వచ్చాక అమెరికా, ఆస్ట్రేలియా, లండన్ లాంటి దేశాల్లో పదుల సంఖ్యలో లైవ్ సింగింగ్ కాన్సర్ట్స్ చేశాడు దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad) . మామూలు ఆడియో ఫంక్షన్లు, ప్రీరిలీజ్ ఈవెంట్స్ లోనే రచ్చ రచ్చ చేసే దేవిశ్రీప్రసాద్ ఇక కాన్సర్ట్ లో ఏ స్థాయిలో రెచ్చిపోతాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అందుకే పరాయి దేశాల్లో దేవి కాన్సర్టులకు భారీ డిమాండ్ ఉంటుంది. అటువంటి దేవిశ్రీప్రసాద్ మొట్టమొదటిసారిగా ఇండియాలో, అది కూడా హైదరాబాద్ లో నిర్వహించిన లైవ్ కాన్సర్ట్ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. సౌండ్ క్వాలిటీ ఫెయిల్ అవ్వడం, మధ్యమధ్యలో దర్శకులు స్టేజ్ మీదకి వచ్చి స్పీచులు ఇచ్చి కాన్సర్ట్ కు ప్రీరిలీజ్ ఈవెంట్ వైబ్ తీసుకురావడం లాంటి విషయాలను పక్కన పెడితే.. మహేష్ బాబు (Mahesh Babu) ఫ్యాన్స్ మాత్రం కాన్సర్ట్ విషయంలో చాలా హర్ట్ అయ్యారు. అందుకు కారణం లేకపోలేదు.
దాదాపు నాలుగు గంటలపాటు సాగిన కాన్సర్ట్ లో ఒక్కటంటే ఒక్క మహేష్ బాబు పాట లేకపోవడం అనేది మహేష్ అభిమానులను చాలా బాధించింది. అయితే ఆ విషయం గమనించిన దేవిశ్రీప్రసాద్ “ఒన్ నేనొక్కడినే” (1: Nenokkadine) చిత్రంలోని ‘హు ఆర్ యూ’ పాట పాడేందుకు ప్రయత్నించగా టెక్నికల్ అంశాలు అడ్డొచ్చి పాట పాడనివ్వలేదు. దాంతో నిన్నటి నుండి దేవిశ్రీప్రసాద్ ను మహేష్ అభిమానులు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు.
వాళ్లకి రెగ్యులర్ ఆడియన్స్ కూడా తోడయ్యారు. కాన్సర్ట్ లో సౌండ్ సరిగా లేదని, దేవిశ్రీప్రసాద్ మొదటి ఇండియన్ కాన్సర్ట్ ఇలా జరగడం ఏమీ బాలేదని ఎవరి బాధలు వారు చెప్పుకొచ్చారు. మరి ఈ విషయమై దేవిశ్రీప్రసాద్ ఏమైనా స్పందిస్తాడో లేదో చూడాలి. దేవిశ్రీప్రసాద్ కాన్సర్ట్ పూర్తవ్వడంతో, అందరూ తమన్ ఎప్పడు ఇండియాలో, అది కూడా హైదరాబాద్ లో కాన్సర్ట్ చేస్తారా అని ఎదురుచూస్తున్నారు.