Mahesh Babu, Trivikram: ఆ ప్రకటన వల్ల టెన్షన్ లో మహేష్ ఫ్యాన్స్?

మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది. నవంబర్ తొలి వారం నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందని వార్తలు వచ్చాయి. అయితే సితార ఎంటర్టైన్మెంట్స్ తాజా ప్రకటన వల్ల మహేష్ బాబు ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు. అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఒక మూవీ తెరకెక్కనున్నట్టు తాజాగా ప్రకటన వెలువడింది.

పుష్ప పార్ట్1లో నటిస్తున్న అల్లు అర్జున్ ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తాడని ప్రచారం జరుగుతుండటంతో మహేష్ ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. మేకర్స్ మహేష్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ గురించి క్లారిటీ ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా మొదలు కాలేదు. త్రివిక్రమ్ ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ బీమ్లా నాయక్ కోసం పని చేస్తున్నారు. నవంబర్ నెలాఖరు నాటికి అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ షూటింగ్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

త్రివిక్రమ్ లేదా మహేష్ తమ తర్వాత ప్రాజెక్ట్ గురించి స్పందిస్తారేమో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే. నవంబర్ నెలాఖరు నాటికి మహేష్ బాబు సర్కారు వారి పాట షూటింగ్ పూర్తి చేసే ఛాన్స్ ఉంది. పరశురామ్ దర్శకత్వం వహించిన సర్కారు వారి పాట మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus