Mahesh Babu: క్లారిటీ ఇవ్వకుండా మహేష్ డైరెక్టర్లు తప్పు చేశారా?

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకోవడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. మే 31వ తేదీన కృష్ణ పుట్టినరోజు కావడంతో త్రివిక్రమ్, రాజమౌళి సినిమాలకు సంబంధించిన అప్ డేట్లు వస్తాయని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే మహేష్ బాబు అభిమానులకు మాత్రం చివరకు నిరాశే ఎదురైంది. ఈ రెండు ప్రాజెక్ట్ లకు సంబంధించి ఎలాంటి అప్ డేట్లు రాలేదు.

మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ షూటింగ్ ఇంకా మొదలుకాలేదు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ లో నటించే నటీనటుల వివరాలు, టెక్నీషియన్ల వివరాలకు సంబంధించి కొన్ని అప్ డేట్లు వచ్చాయి. ఈ సినిమా లుక్ ను ప్రత్యేకంగా షూట్ చేసి రివీల్ చేస్తే మరీ త్వరగా ప్రమోషన్స్ ను మొదలుపెట్టినట్టు అవుతుందని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. రెగ్యులర్ షూటింగ్ మొదలైన కొన్ని నెలల తర్వాత అప్ డేట్లు ఇవ్వాలని మేకర్స్ భావిస్తున్నారని సమాచారం.

మరోవైపు మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్ మొదలుకావడానికి చాలా సమయం ఉంది. ఈ సినిమా కథ ఇంకా ఫైనల్ కాలేదని తెలుస్తోంది. ఆ రీజన్ వల్లే రాజమౌళి ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వడానికి ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. అయితే ముందుగానే ఎలాంటి అప్ డేట్లు ఇవ్వడం లేదని క్లారిటీ ఇచ్చి ఉంటే బాగుండేదని మహేష్ బాబు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

మహేష్ తర్వాత ప్రాజెక్ట్ లతో సంచలన విజయాలను అందుకోవడంతో పాటు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకుని తన స్థాయిని పెంచుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మహేశ్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ రెండు సినిమాలు పూర్తయ్యే వరకు మహేష్ కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు అయితే దాదాపుగా లేవని సమాచారం అందుతోంది.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus