మళ్ళీ అల్లు అర్జున్ ను ట్రోల్ చేస్తున్న మహేష్ ఫ్యాన్స్

నిన్న ఎన్టీవీ ప్రసారం చేసిన ఎంటర్ టైన్మెంట్ బులిటెన్ లో భాగంగా “సరిలేరు నీకెవ్వరు” చిత్రంలో మహేష్ బాబు లుక్ పై వస్తున్న ట్రోల్స్ ను ప్రస్తావించింది ఎన్టీవీ యాంకర్. ఈ విషయాన్ని మహేష్ బాబు ఫ్యాన్స్ కాస్త సీరియస్ గా తీసుకొన్నట్లున్నారు. వెంటనే.. ఎన్టీవీ స్టాఫ్ ను, సదరు యాంకర్ ను ట్రోల్ చేయడం మొదలెట్టారు. ఇంతలో.. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ & అల్లు అర్జున్ కి డిజిటల్ మేనేజర్ గా పని చేస్తున్న శరత్ చంద్ర అనే వ్యక్తి కూడా ఇదివరకు ఎన్టీవీ ఉద్యోగి కావడంతో.. అతడే ఇదంతా చేయిస్తున్నాడని ట్విట్టర్ సాక్షిగా అతడ్ని బూతులు తిట్టడం మొదలెట్టారు మహేష్ బాబు ఫ్యాన్స్.

తాను ఎన్టీవీలో ఉద్యోగం మానేసి సంవత్సరం అయ్యింది అని శరత్ స్టేట్ మెంట్ ఇచ్చినప్పటికీ.. మహేష్ బాబు ఫ్యాన్స్ అతడ్ని వదలడం లేదు. “అల్లు మాఫియా” అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేయడంతోపాటు.. అల్లు అర్జున్ & కో ను బూతులు తిట్టడం మొదలెట్టారు. ఎన్టీవీలో ప్రసారమైన నెగిటివ్ న్యూస్ వెనుక అల్లు అర్జున్ హస్తం ఉంది అనేది వారి వాదన, సంక్రాంతికి మహేష్, బన్నీల సినిమాలు పోటీకి దిగుతుండడంతో కావాలనే ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని వాళ్ళు భావిస్తున్నారు. ఈ ఫ్యాన్ వార్స్ ఎలా ఉన్నా.. ఇలా సాధారణ ఉద్యోగులను మధ్యలోకి లాగి వారిని, వారి కుటుంబ సభ్యులను అసభ్యంగా బూతులు తిట్టడం అనేది సరైన పద్ధతి మాత్రం కాదు. ఈ విషయాన్ని ఫ్యాన్స్ ఎప్పుడు అర్ధం చేసుకొంటారో.

ఎవ్వ‌రికీ చెప్పొద్దు సినిమా రివ్యూ & రేటింగ్!
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus