చరణ్, ఎన్టీఆర్ లతో స్నేహంపై స్పందించిన మహేష్ బాబు.!

సూపర్ స్టార్ హోదా ఉన్నప్పటికీ మహేష్ బాబు తోటి హీరోలతో చాలా స్నేహంగా ఉంటారు. విక్టరీ వెంకటేష్ తో కలిసి నటించి టాలీవుడ్ లో మల్టీ స్టారర్ మూవీ సినిమాలను మళ్ళీ ప్రోత్సహించారు. అలాగే తన సినిమా భరత్ అనే నేను సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ఎన్టీఆర్ ని ఆహ్వానించి కొత్త సంప్రదాయానికి తెరలేపారు. మేమంతా ఒకటే అనే.. మేము బాగున్నాము.. మీరు కూడా కలిసి ఉండాలని అభిమానులకు సందేశాన్నిచ్చారు. తాజాగా ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ తేజ్ తో కలిసి పార్టీ చేసుకొని, కలిసి ఫోటోలు దిగి ఆకట్టుకున్నారు. ఈ ఫోటో అనేక గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టిందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్టీఆర్ , రామ్ చరణ్ తో స్నేహం గురించి ఈరోజు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ ఆసక్తికర విషయం చెప్పారు.

“మేము చాలా స్నేహంగా ఉంటాము. నేను, రామ్ చరణ్ కలిసి విదేశాల్లో విహారానికి వెళ్తుంటాము. ఎన్టీఆర్, నేను అనేక సందర్భాల్లో కలుసుకుంటుంటాము.” అని వివరించారు. అంతేకాకుండా అభిమానుల మధ్య గొడవల గురించి స్పందించారు. “స్టార్ హీరోల ఫ్యాన్స్  మధ్య ఈ కన్ఫ్యూజన్ ఎవరు సృష్టిస్తుంటారో తెలియదు. అయితే ఈ గొడవలు త్వరలోనే ఆగిపోతాయని నమ్ముతున్నాను.” అని వెల్లడించారు. చివరగా మాట్లాడుతూ “ప్రతి పెద్ద చిత్రం విజయవంతమవ్వాల్సిన అవసరం పరిశ్రమకి చాలా ఉంది. అందుకే స్టార్ హీరోలం కలసి మంచి వాతావరణం సృష్టించబోతున్నాం” అని మహేష్ స్పష్టం చేశారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus